Hyderabad Girl Missing in America : అమెరికాలో తెలుగు విద్యార్థులు వరుసగా ప్రమాదాలకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇదే ఏడాదిలో హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి కనిపించకుండాపోయి, ఆ తర్వాత శవమై కనిపించాడు. ఇలా ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో భారతీయ విద్యార్థులు చాలా మంది చనిపోయారు. ఇప్పుడు తాజాగా కాలిఫోర్నియా రాష్ట్రంలో 23 ఏళ్ల ఓ తెలుగు విద్యార్థిని అదృశ్యమైంది. గత వారం రోజులుగా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు ప్రజల సాయం కోరారు.
Hyderabad Student Missing In California : హైదరాబాద్‌కు చెందిన నితీశ కందుల కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, శాన్ బెర్నార్డినోలో చదువుతోంది. మే 28 నుంచి కనిపించకుండా పోయింది. చివరి సారిగా ఆమె లాస్ ఏంజిల్స్‌లో కన్పించినట్లు యూనివర్సిటీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత నుంచి నితీశ అదృశ్యమైనట్లు తెలిసింది. దీనిపై అక్కడి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఆమె గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని స్థానికులను కోరారు.
అమెరికాలో తెలంగాణ విద్యార్థుల మిస్సింగ్ : గత నెలలో తెలంగాణకు చెందిన రూపేశ్ చంద్ర చింతకింది షికాగోలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ అతడి ఆచూకీ తెలియలేదు. ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ అరాఫత్ కన్పించకుండా పోయాడు. ఆ తర్వాత నెల రోజుల తర్వాత క్లీవ్‌లాండ్‌లోని ఒహాయోలో ఓ సరస్సు వద్ద అతడి మృతదేహం దొరికింది. క్లీవ్‌లాండ్‌లోని ఓ ముఠా అబ్దుల్‌ను కిడ్నాప్ చేసి అతడి తండ్రికి ఫోన్ చేసి డబ్బులు పంపాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఇదే ఏడాది అమెరికాలోని చికాగోలో హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి సయ్యద్ మజాహిర్ అలీపై కూడా గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ విద్యార్థి ఇండియానా వెస్లయన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. అక్కడి భారత దౌత్య కార్యాలయం ఆ విద్యార్థికి అవసరమైన సాయం చేసింది.
అమెరికాలో రోడ్డు ప్రమాదం - ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి - Telangana Students Died In America