Hyderabad Police Counter to Shakeel Comments : పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న రాహిల్ తన తండ్రి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పందించారు. వారి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటివరకు ఈ కేసులో ఇద్దరు ఇన్స్పెక్టర్లు సహా 15 మందిని అరెస్టు చేశామని తెలిపారు. నిరాధార వ్యాఖ్యలు చేసిన షకీల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.
డిసెంబర్ చివరి వారంలో పంజాగుట్ట పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం(Panjagutta Hit and Run Case) కేసులో దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతుందని సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్ధరాత్రి మితిమీరిన వేగంతో ప్రజాభవన్ సమీపంలో భారీగేట్లను కారు ఢీ కొట్టింది. వాహనం నడిపింది రాహిల్ అయితే అతడికి బదులు వేరే వ్యక్తిని డ్రైవింగ్ సీట్లో ఉంచి నిందితుడు పరారయ్యాడని తెలిపారు. ఇందుకు అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ సహకరించారన్నారు.
కుమారుడిని కాపాడేందుకు షకీల్ ప్రయత్నం : దీంతో గంటల వ్యవధిలో నిందితుడైన రాహిల్ అలియాస్ సాహిల్ దుబాయ్ పారిపోయాడని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకూ 15 మందిని అరెస్టు చేయగా కేసులో అతని తండ్రి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సైతం నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. ఘటన జరిగిన రోజు పోలీసు అధికారులను ప్రభావితం చేసిన షకీల్ అతని కుమారుడిని కాపాడుకునే ప్రయత్నం చేశాడనీ వెల్లడించారు.
-
నా కొడుకు రాహిల్ తప్పు చేస్తే ఉరి తీయండి
— Telugu Scribe (@TeluguScribe) April 17, 2024
పోలీసులు అన్యాయంగా నా కొడుకుని కేసుల్లో ఇరికిస్తున్నారు. జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడి ప్రమేయం లేదు. తనే డ్రైవింగ్ చేసినట్లు ఒప్పుకోక పోతే నా కొడుకుని చంపుతామని పోలీసులు బెదిరిస్తున్నారు.
ఈ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ… pic.twitter.com/LGioAC2wi8
Jubilee Hills Road Accident Case Update : ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే గతంలోనూ ఇదే తరహా నేరానికి పాల్పడినట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. కోర్టు అనుమతితో ఆ కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 2022 మార్చిలో జూబ్లీహిల్స్ రోడ్(Jubilee Hills Road Accident) నంబర్ 45లో వేగంగా వచ్చిన కారు ఫుట్‌పాత్‌పై బెలూన్లు అమ్ముకుంటున్న వారిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందాడు. మహిళా తీవ్రంగా గాయపడింది. ఘటనా సమయంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశారన్నారు. కేసు దర్యాప్తు చేసిన అధికారిని సైతం విచారించామని సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు.
'తప్పు చేస్తే నా కుమారుడ్ని శిక్షించండి - ఇలా కేసులు పెట్టి టార్చర్ చేయకండి'
కాగా కారు నడిపింది తానేనని ఆఫ్రాన్ అనే యువకుడు లొంగిపోయాడని సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి వివరించారు. కేసును తిరిగి దర్యాప్తు చేస్తున్న సమయంలో మరి కొన్ని విషయాలు తెలిశాయని వెల్లడించారు. లొంగిపోయిన వ్యక్తి పై కేసు నమోదు చేసి చార్జిషీటు కోర్టులో ఫైల్ చేశారన్నారు. కానీ కారులో ఉన్న రాహిల్ తర్వాతి రోజే దుబాయ్ వెళ్లిపోయాడని తెలిసిందని అన్నారు. రెండింటిలోనూ రాహిల్ నిందితుడిగా ఉండే, కావాలనే పారిపోయినట్లు ఆధారాలున్నాయన్నారు. హైకోర్టు ఆదేశాల అనుగుణంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
షకీల్‌పై కేసు నమోదు చేస్తాం : ఇదే క్రమంలో షకీల్ ఓ వీడియో విడుదల(Shakeel Video) చేశారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. అందులో దర్యాప్తు అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తూ వీడియోలో ప్రస్తావించారని పోలీసులు అన్నారు. మతపరమైన, రాజకీయపరమైన ఇతర సూచనలతో చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. కేసులో నిందితులుగా ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దర్యాప్తును తప్పుపట్టేలా నిరాధార, ఊహాజనిత వ్యాఖ్యలు చేసిన వారిపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాహిల్‌పై మరో కేసు - జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంలోనూ నిందితుడిగా నిర్ధారణ
మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అరెస్ట్ - ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్