ETV Bharat / state

చలో గోవా : ప్రతిసారి హోటల్స్​లో దిగడం ఎందుకు? - మనమే ఓ 'హాలిడే హోమ్' కొనేస్తే పోలా! - PEOPLE BUYING HOUSES IN GOA

గోవాలో ఇళ్లు కొనేెందుకు ఆసక్తి చూపుతున్న పర్యాటకులు - గోవాలో తీరం వెంబడి నిర్మించిన విలాసవంతమైన హాలిడే హోమ్‌లకు భారీ డిమాండ్‌

Holiday Homes In Goa
People Are Interest in Buying Houses In Goa (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2024, 10:00 AM IST

People Are Interest in Buying Houses In Goa : పర్యాటకుల తాకిడితో ఎప్పుడూ కోలాహలంగా ఉండే నగరం గోవా. వరుసగా సెలవులు వస్తే చాలు అందరూ అక్కడ సేద తీరేందుకు వెళ్లడానికి ప్లాన్ చేస్తుంటారు. ఈ మధ్య ఉత్తరాది, దక్షిణాదితో సంబంధం లేకుండా అందరూ గోవాకే వెళ్తున్నారు. అక్కడి అరేబియా సముద్ర తీరంలోని ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు ఇష్టపడుతున్నారు. తరచూ వెళ్తుండటంతో హోటళ్లు, రిసార్టుల్లో బస చేస్తుంటారు. వీటికి ఎక్కువగా ఖర్చు అవుతుండటంతో అక్కడే ఒక ఇల్లు కొనాలని ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. హాలిడే హోమ్స్‌కు ప్రముఖ గమ్యస్థానంగా ఉన్న గోవాను నివాస కేంద్రాలకు ప్రాధాన్య ప్రదేశంగా 35 శాతం మంది ఎంచుకుంటున్నట్లు ఇండియా సోథెబైస్‌ ఇంటర్నేషనల్‌ రియాల్టీ (ఐఎస్‌ఐఆర్‌) సర్వేలో తేలింది.

గోవాలో రియల్‌ ఎస్టేట్‌ : విదేశాలను తలపించే జీవనశైలి, ఆకర్షణీయమైన సహజ సౌందర్యం, గొప్ప సాంస్కృతిక వారసత్వం, సకల సౌకర్యాలు కల్గిన పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది గోవా. గోవాకి ఒక్కసారి వెళితే చాలు మనసును కట్టిపడేస్తుంది. మళ్లీ మళ్లీ రప్పించుకుంటుంది. సాధారణంగా అక్కడికి వెళ్లేవారు హోటళ్లు, రిసార్టుల్లో బస చేస్తుంటారు. అధిక ఆదాయ వర్గాలైతే ఏకంగా ఇళ్లను కొనేస్తున్నారు. ఇప్పుడు గోవాలోనూ పోకడలు మారాయి. పాక్షిక యాజమాన్య అవకాశాన్ని స్థానిక రియాల్టీ సంస్థలు కల్పిస్తున్నాయి. ఖరీదైన స్థిరాస్తుల్లోనూ తమ వద్ద ఉన్న పెట్టుబడితో పాక్షిక వాటాలను కొనుగోలు చేయడానికి అవకాశం ఇస్తున్నాయి. గోవాలో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ఆధునికతకు పెద్ద పీట వేస్తున్నారు. దీనికి తగ్గ మౌలిక వసతుల కల్పన కోసం అక్కడి ప్రభుత్వం శ్రమిస్తోంది.

అంతర్జాతీయ విమానాశ్రయం : గోవాకు రహదారి, రైల్వే, విమాన సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి వారంలో రెండు రోజులు రైలు సౌకర్యం ఉండగా, ఇటీవల మరొకటి ప్రారంభించారు. రోజు మొత్తం ప్రయాణం చేసేంత ఓపిక లేనివారు ఖర్చుకు వెనకాడకుండా విమానాల్లో వెళ్తున్నారు. ఉత్తర గోవాలో ఇటీవలె అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది. దీంతో ప్రపంచ దేశాలతో అనుసంధానం పెరిగింది. ఇవన్నీ ఆ పర్యాటక ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. నివాస, వాణిజ్య రియల్‌ ఎస్టేట్​పై దీని ప్రభావం ఉందని మార్కెట్‌ వర్గాలు తెలుపుతున్నాయి.

స్థిర రాబడులే కారణం : గోవాలో తీరం వెంబడి నిర్మించిన విలాసవంతమైన హాలిడే హోమ్‌లకు చాలా డిమాండ్‌ ఉంది. ఇక్కడ పర్యాటకులు ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. పర్యాటకులు సంవత్సరమంతా వస్తుంటారు. డిమాండ్‌ దృష్ట్యా వీటి అద్దెలూ ఎక్కువే. ఖాళీగా ఉండే సందర్భాలు చాలా తక్కువ. కాబట్టి ఇంటి యజమానులు, రియల్ ఎస్టేట్​పై పెట్టుబడులు పెట్టిన వారు సైతం స్థిరంగా రాబడులు అందుకోవచ్చు. గోవాలో పెట్టుబడి ఆకర్షణీయంగా మారడానికి ఇదీ ఒక కారణంగా చెబుతున్నారు.

భౌగోళికంగా విస్తరిస్తోంది : పర్యాటకుల సంఖ్య పెరగడంతో గోవాలో స్థిరాస్తి మార్కెట్‌ భౌగోళికంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు పరిమితంగా ఉన్న మార్కెట్‌, ఇప్పుడు కొత్త ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తోంది. కొనుగోలుదారులకు ఎక్కువ ఐచ్ఛికాలు ఇస్తోంది. మార్కెట్‌ విస్తరణతో పాటు ధరలూ పెరిగాయి. ఒకప్పుడు రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్ల మధ్య ఉండగా, ఇప్పుడు కొన్ని విల్లాలు రూ.100 కోట్ల వరకు పలుకుతున్నాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్​ టు గోవా డైరెక్ట్​ ట్రైన్ స్టార్ట్​ - టైమింగ్స్​తో పాటు పూర్తి వివరాలు మీకోసం - KISHAN REDDY TO INAUGURATEd TRAIN

గోవా ట్రిప్​ ప్లాన్​ చేస్తున్నారా? సికింద్రాబాద్​ నుంచి డైరెక్ట్​ ట్రైన్ - వివరాలివే​ - Hyderabad To Goa Special Train

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.