ETV Bharat / state

ఇప్పుడు కొత్త మదుపర్ల చూపు అటువైపే - పెట్టుబడి పెట్టారో డబ్బులే డబ్బులు - INVESTMENTS IN REAL ESTATE SECTOR

స్థిరాస్తి రంగంలో నెలవారీ ఆదాయం - కేవలం రూ.100లతో స్థిరాస్తుల్లో పెట్టుబడి - అవకాశం కల్పిస్తున్న రీట్స్​ - కొత్త మదుపర్ల చూపు అటువైపే

Real Estate Latest Updates
Real Estate Latest Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2024, 5:07 PM IST

Real Estate Latest Updates : స్థిరమైన ఆదాయం కోసం గృహాలు కొనుగోలు చేసి చాలా మంది అద్దెకు ఇస్తుంటారు. అలాగే వాణిజ్య, రిటైల్​ స్పేస్​ను కొని లీజ్​ ద్వారా నెలవారీగా ఆదాయం సంపాదిస్తుంటారు. కానీ ఈ రెండింటిలోనూ పెట్టుబడి పెట్టేందుకు అధిక మొత్తంలో డబ్బు కావాలి. అయితే వీటిలో ఆస్తులపై పూర్తి యాజమాన్య హక్కులు ఉంటాయి. ఈ రెండింటికీ భిన్నంగా ఇటీవల కాలంలో మాల్స్​, వాణిజ్య భవనాల్లో కొద్ది మొత్తంతోనే పాక్షిక యాజమాన్య హక్కులతో రిటైల్​ స్పేస్​లో వాటా ఇస్తున్నారు. వీటి చట్టబద్ధతపై కొనుగోలుదారుల్లో సందేహాలు ఉన్నప్పటికీ రాబడి మెరుగ్గా ఉంటుందనే ప్రచారంతో ఆకర్షితులు అవుతున్నారు.

ఇందులో రూ.లక్షలు లేనిదే పెట్టుబడి పెట్టలేం.. అందుకే వీటికి ప్రత్యామ్నాయంగా వందలు, వేలు రూపాయలతోనే రియాల్టీలో పెట్టుబడులకు రీట్స్​(రియల్​ ఎస్టేట్​ ఇన్వెస్ట్​మెంట్​ ట్రస్ట్) అవకాశం కల్పిస్తోంది. ఇవి మాత్రం మ్యూచువల్​ ఫండ్ల మాదిరిగా పని చేస్తాయని తెలిపింది. చేతిలో సొమ్ము ఉన్నప్పుడు యూనిట్ల వారీగా కొనుగోలు చేయవచ్చని ఇండియన్​ రీట్స్​ అసోసియేషన్​ పేర్కొంది. ఇవి పూర్తిగా మార్కెట్​ నియంత్రణ సంస్థ సెబీ పర్యవేక్షణలోనే పని చేస్తాయని, పూర్తి పారదర్శకత అని చెప్పింది.

పెట్టుబడులు పెట్టి మంచి రాబడులు కోసం అనువైన మార్గాలను మదుపర్లు ఎప్పటికప్పుడు అన్వేసిస్తుంటారు. అందులో మార్కెట్ల పరిస్థితులను బట్టి కాలానుగుణంగా షేర్లు, మ్యూచువల్​ ఫండ్లు, ఎఫ్​డీలు, బంగారం, బాండ్లు, స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడుతుంటారు. ఈ క్రమంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో స్థిరాస్తి రంగంపై ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే ఇందులో తక్కువ మొత్తంతో వాణిజ్య స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు రీట్స్​ అవకాశం కల్పిస్తున్నాయి.

ఇందులో రూ.100 నుంచే మదుపు చేయవచ్చు.. దీంతో కొత్తతరం మదుపర్లను బాగా ఆకర్షిస్తోంది. దీంతో నేరుగా స్థిరాస్తులను కొనుగోలు చేయకుండా, ఆదాయంలో వాటాను సంపాదించడానికి రీట్స్​ అవకాశం కల్పిస్తోంది. నేరుగా స్థిరాస్తులను కొనుగోలు చేయకుండా, ఆదాయంలో వాటాను సంపాదించుకోవడానికి రీట్స్​ అవకాశం ఇస్తోంది. మన దేశంలో మొట్టమొదటగా 2019లో ఎంబసీ రీట్​ లిస్ట్​ అయింది. ఆ తర్వాత 2020లో మైండ్​ స్పేస్​ రీట్​, 2021లో బ్రూక్​ ఫీల్డ్​ రీట్​, 2023లో మొదటి మాల్​ రీట్స్​ నెక్సెస్​ లిస్ట్​ అయ్యాయి. ఇప్పటివరకు మార్కెట్​లో నాలుగు రీట్స్​ లిస్ట్​ అయ్యాయి.

యూనిట్​గా కొనుగోలు : డీమ్యాట్​ ఖాతా ద్వారా మ్యూచువల్​ ఫండ్లు, షేర్లు కొనుగోలు చేసే మాదిరి రీట్స్​ కొనుగోలు చేసుకోవచ్చు. ఇవి రూ.100 నుంచి రూ.400 మధ్యలో యూనిట్​ ధరలు ఉన్నాయి. పెట్టుబడిదారుల సొమ్ముతో రీట్స్​ స్థిరాస్తులను కొనుగోలు చేయడం, వాటిని అద్దెకు ఇవ్వడం ద్వారా రాబడిని సంపాదిస్తారు. ఈ క్రమంలో వాణిజ్య కార్యాలయాలపై ఎక్కువ పెట్టుబడులు పెడుతుంటాయి. ప్రస్తుతం నాలుగు రీట్స్​ కలిసి దేశవ్యాప్తంగా 125 మిలియన్​ చదరపు అడుగుల విస్తీర్ణంతో గ్రేడ్​-ఏ కార్యాలయాలు, రిటైల్​ స్పేస్​ ఉన్నాయి.

2.5 లక్షల మంది రిటైల్​ ఇన్వెస్టర్లు పెట్టుబడులు : రీట్స్​లో అత్యధికంగా విదేశీ పోర్ట్​ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతున్నారు. వీరు మదుపు చేసిన సంపద విలువే రూ.20 వేల కోట్ల వరకు ఉండగా.. ఆ తర్వాత బీమా కంపెనీలు రూ.7 వేల కోట్ల వరకు రీట్స్​లో పెట్టుబడి పెట్టాయి. ఇప్పటివరకు రిటైల్​ ఇన్వెస్టర్లు 2.5 లక్షల మంది పెట్టుబడులు పెట్టారు. ఈ సంఖ్య మున్ముందు పెరగనుందని మార్కెట్​ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఐదేళ్లలో రీట్స్​ రాబడి 11.3 శాతం : పన్నులు పోగా వచ్చిన రీట్స్​ రాబడి 11.3 శాతం అని ఇండియన్​ రీట్స్​ అసోసియేషన్​ పేర్కొంది. 6.3 శాతం ఆస్తుల విలువ పెరగడం వల్ల లాభం సమకూరింది. షేర్​ మార్కెట్​తో పోలిస్తే రీట్స్​లో ఒడిదొడుకులు తక్కువ, నిలకడగా వృద్ధి, దీర్ఘకాలంలో మంచి రాబడులు వస్తాయని తెలిపింది. యూనిట్లను విక్రయించి వెంటనే నగదు చేసుకోవచ్చని, లిక్విడిటీ సులభమని ఇటీవల హైదరాబాద్​లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఇండియన్​ రీట్స్​ అసోసియేషన్​ వెల్లడించింది.

ఇల్లు కొనాలనుకుంటున్నారా? - వెంటనే త్వరపడండి - ఇలాంటి ఆఫర్ మళ్లీ దొరకదు!

రియల్ ఎస్టేట్ లేటెస్ట్ రిపోర్ట్- హైదరాబాద్​లో అతితక్కువ గ్రోత్- టాప్ 8 సిటీస్​లో లాస్ట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.