ETV Bharat / state

హైదరాబాద్​లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు - రూ.9 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం​ - Huge Drug bust in Hyderabad - HUGE DRUG BUST IN HYDERABAD

Huge Drug bust in Hyderabad : హైదరాబాద్ సమీపంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఐడీఏ బొల్లారంలోని ఓ ఫ్యాక్టరీలో రూ.9 కోట్ల విలువైన మెపిడ్రిన్ డ్రగ్స్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Drugs bust Near Hyderabad
Huge Drugs bust Near Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 22, 2024, 11:55 AM IST

Updated : Mar 22, 2024, 12:22 PM IST

Huge Drug bust in Hyderabad : రాష్ట్ర రాజధాని శివారులో నిషేధిత డ్రగ్స్‌ తయారు చేస్తున్న పరిశ్రమపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. భారీగా నిషేధిత ఔషధాల ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.9 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఐడీఏ బొల్లారం ప్రాంతంలోని ఓ పరిశ్రమలో పెద్ద ఎత్తున నిషేధిత డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్టు డీఆర్‌ఐ అధికారులకు ఇంటర్‌ పోల్‌ ద్వారా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఔషధ నియంత్రణ అధికారులు, బొల్లారంలోని ఔషధ తయారీ సంస్థపై దాడులు నిర్వహించారు.

Huge Drug bust in Hyderabad
హైదరాబాద్​లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు - రూ.9 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం​

నిషేధిత మెపిడ్రిన్‌ డ్రగ్స్‌ అక్కడ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. దాడుల్లో 90 కిలోల మెపిడ్రిన్‌ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గత 10 సంవత్సరాలుగా డ్రగ్స్‌ తయారు చేసి, విదేశాలకు తరలిస్తున్నట్టు ఔషధ నియంత్రణ శాఖ విచారణలో బయటపడింది. సిగరెట్‌ ప్యాకెట్లలో డ్రగ్స్‌ విదేశాలకు తరలిస్తున్నట్టూ తేలింది. హైదరాబాద్‌లో కూడా డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో పాటు పలు దేశాలకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఒడిశా నుంచి హైదరాబాద్​కు గంజాయి సరఫరా - మాటువేసి పట్టుకున్న పోలీసులు - Ganja Supplier Arrested In Hyd

ఆపరేషన్​ గరుడలో 25 వేల కిలోల డ్రగ్స్​ గుట్టు రట్టు : మరోవైపు గురువారం ఏపీలోని విశాఖ తీరంలోనూ డ్రగ్స్‌ కలకలం రేగింది. బ్రెజిల్‌ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు వచ్చిన కంటైనర్‌లో సుమారు 25 వేల కిలోల డ్రగ్స్‌ ఉన్నట్లు సీబీఐ, నార్కోటిక్స్‌ అధికారులు గుర్తించారు. ఇంటర్‌ పోల్‌ అధికారులు ఇచ్చిన సమాచారంతో దిల్లీ సీబీఐ, విశాఖలోని సీబీఐ, కస్టమ్స్‌ అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

ఈ నెల 19న నార్కోటిక్స్‌ సామగ్రి, నిపుణులతో వచ్చిన సీబీఐ అధికారులు ఆ కంటైనర్​లో భారీ మొత్తంలో డ్రగ్స్‌ ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగా అధికారులు వాటిని సీజ్ చేశారు. జర్మనీలోని హ్యాంబర్గ్‌ మీదుగా ఈ నెల 16న కంటైనర్‌ విశాఖకు వచ్చినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఓ ప్రైవేటు కంపెనీ ఈ డ్రగ్స్ బ్యాగులను 25 కిలోల చొప్పున 1000 బ్యాగుల డ్రగ్స్ నింపి సరఫరా చేసినట్లు తెలుస్తోంది.

సీబీఐ స్పెషల్ ఆపరేషన్ - విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టివేత - CBI Seizes Drugs In Visakahaptanm

నానక్​రామ్​గూడ అడ్డాగా నీతూబాయి గాంజా దందా - పోలీస్ డెకాయ్‌ ఆపరేషన్‌లో బహిర్గతం

Last Updated : Mar 22, 2024, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.