How To Pay Property Tax GHMC in Online : జీహెచ్ఎంసీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఆస్తి పన్ను వసూళ్లకోసం "ఎర్లీ బర్డ్" పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా ఏప్రిల్ 30వ తేదీలోపు పన్ను చెల్లించిన వారికి.. 5 శాతం రాయితీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మీరు ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయాలనుకుంటే.. ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్‌లోనే ఈజీగా ఆస్తిపన్ను చెల్లించొచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
GHMC ఆస్తిపన్ను ఈజీగా ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో చూద్దాం :
- ముందుగా మీరు ఆన్‌లైన్‌లో ఆస్తి పన్ను చెల్లించడానికి.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, తెలంగాణ గవర్నమెంట్ అఫిషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- తర్వాత హోం పేజీలో వచ్చిన ఈ https://ghmc.gov.in/ లింక్‌ను క్లిక్ చేయాలి.
- అనంతరం 'Online Payments' అనే ఆప్షన్‌ను ఎంచుకుని 'ప్రాపర్టీ ట్యాక్స్' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీకు మరో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- అప్పుడు మీ PTIN(ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య), రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను టైప్ చేసిన మీ చెల్లించాల్సిన ఆస్తిపన్ను బకాయిలను పరిశీలించాలి.
- తర్వాత మీ ఫోన్‌కు ఒక 'OTP' వస్తుంది.. దానిని అక్కడ అడిగిన బాక్స్‌లో ఎంటర్ చేసి 'Submit OTP'పై క్లిక్ చేయండి.
- అప్పుడు మీరు చెల్లించాల్సిన బకాయిలు, వాటిపై వడ్డీ, సర్దుబాట్లు, ఆస్తి పన్ను వంటి వివరాలు మీకు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- ఇప్పుడు మీరు ట్యాక్స్‌ను ఏ విధంగా చెల్లిస్తారో ఆ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. Net Banking, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ల ద్వారా పన్ను చెల్లించవచ్చు.
- మీ పేమెంట్ సక్సెస్ అయ్యాక మీకు ఒక రశీదు కూడా వస్తుంది.
ఇలా సింపుల్‌గా ఆన్‌లైన్‌లో GHMCలో మీ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించవచ్చు. అయితే.. ఇలా మొబైల్‌లో ఆస్తి పన్ను చెల్లించాలంటే తప్పనిసరిగా మీకు PTIN నెంబర్ ఉండాలి. ఆ నెంబర్ మీ వద్ద లేకపోతే ఇలా పొందండి.
ఆన్‌లైన్‌లో GHMC ప్రాపర్టీ టాక్స్ చెల్లించడానికి PTINని పొందడం ఇలా..
- ముందుగా మీరు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(GHMC) అఫిషియల్ వెబ్‌సైట్ https://ghmc.gov.in/ కి వెళ్లాలి.
- తర్వాత 'ఆన్‌లైన్ సర్వీసెస్' ఆప్షన్‌పై క్లిక్ చేసి.. 'Self Assessment of Property Tax’' అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీరు మీ మొబైల్ నంబర్ నమోదు చేసి.. 'Send OTP'పై క్లిక్ చేయాలి.
- తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి 'Submit OTP'పై క్లిక్ చేయాలి.
- తర్వాత ఓపెన్ అయ్యే సెల్ఫ్ అసెస్‌మెంట్ ఫారమ్‌లో మీ రిజిస్ట్రేషన్ వివరాలను ఎంటర్ చేయాలి.
- డ్రాప్‌డౌన్ జాబితా నుంచి సబ్-రిజిస్టర్ కార్యాలయాన్ని ఎంచుకోవడం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్, తేదీని నమోదు చేయడం వంటి వివరాలను ఎంటర్ చేయాలి.
- తర్వాత యజమాని పేరు, తండ్రి పేరు, చిరునామా మొదలైన ఆస్తి వివరాలను కూడా తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.
- అలాగే సేల్ డీడ్ పత్రాన్ని అప్‌లోడ్ చేసి.. చివరగా 'Submit' బటన్‌ను క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ ఆన్‌లైన్ అప్లికేషన్ నగర డిప్యూటీ కమిషనర్‌కు వెళ్తుంది.
- మీరు నమోదు చేసిన ప్రాంతాన్ని అధికారులు సందర్శించి, ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారికి PTIN నంబర్ అందిస్తారు.
మట్టికుండా మజాకా - వేసవిలో సమ్మర్ పాట్స్‌కు సూపర్ క్రేజ్ - Clay Pots Demand in Market