ETV Bharat / state

కర్నూలు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు - కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్​ - HOLIDAYS FOR EDUCATIONAL INSTITUTES

ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం - కలెక్టరెట్లో కమాండ్​ కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు

KURNOOL DISTRICT COLLECTOR
HOLIDAYS FOR EDUCATIONAL INSTITUTES (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2024, 12:45 PM IST

Educational Institutes in Kurnool : కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ రోజు (అక్టోబర్​ 16)న అన్ని ప్రభుత్వ జిల్లా పరిషత్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా సెలవు ప్రకటించినట్లు తెలిపారు. వర్షాల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ 08518-277305 కు ఫోన్ చేసి తెలియచేయాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

కమాండ్​ కంట్రోల్​ రూం : నంద్యాల జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలో బుధవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహలకు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సెలవు ప్రకటించారు. సమస్యల తెలియజేయడానికి జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్​ను ఏర్పాటు చేశారు. వర్షాలకు ఏవైనా సమస్యలు తలెత్తితే కమాండ్ కంట్రోల్ సెంటర్​ ఫోన్ నెంబర్లకు 08514-293903, 08514-293908 తెలియజేయాలని చెప్పారు.

దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడుతుంది. రానున్న 12 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. రేపు పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు ఈదురు గాలులుంటాయని హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా ఆంధ్ర ప్రదేశ్​ రాష్ట్రవ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

మత్స్యకారులకు హెచ్చరిక : మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నెల్లూరు సహా పలు జిల్లాల్లో వర్షాలపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎప్పటికప్పుడు తనకు వర్షాలపై నివేదించాలని సీఎంవోకు (చీఫ్​ మినిస్టర్​ ఆఫీస్​) కు సూచించారు.

ప్రకాశం జిల్లాలో లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించి భోజన వసతి కల్పించారు. ప్రజలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేయడానికి పౌర సరఫరాల శాఖ ఆయా చౌక ధరల దుకాణాలను సిద్ధం చేసింది. తీర ప్రాంతాలలోని ప్రజలను అప్రమత్తం చేయడానికి అధికారులు మంగళవారం విస్తృతంగా పర్యటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

హైదరాబాద్​లో ఓ వైపు ఎండ మరోవైపు వాన - వాహనదారులకు తప్పని తిప్పలు

వెళ్తూనే ప్రతాపం చూపుతోన్న నైరుతి! అల్పపీడనంతో ఏపీలో భారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.