ETV Bharat / state

శివబాలకృష్ణ కేసు - శివ నవీన్​కూ బెయిల్​ నిరాకరించిన నాంపల్లి కోర్టు - శివబాలకృష్ణ కేసు

HMDA EX Director Shiva Balakrishna Case Update : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్​ఎండీఏ మాజీ డైరెక్ట్ శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్​కు నాంపల్లి కోర్టు బెయిల్​ నిరాకరించింది. మరోవైపు ఈ కేసులో శివబాలకృష్ణ బినామీలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఇద్దరిని రెండు రోజులు విచారించింది.

Nampally Court Balakrishna case
Shiva Balakrishna Case update
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2024, 12:45 PM IST

Updated : Feb 16, 2024, 12:58 PM IST

HMDA EX Director Shiva Balakrishna Case Update : ఆదాయనికి మించిన ఆస్తుల కేసులో రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ కేసులో అరెస్టైన అతని సోదరుడు శివ నవీన్​కు నాంపల్లి కోర్టు బెయిల్​ నిరాకరించింది. జైలులో రిమాండ్​ ఖైదీగా ఉన్న శివ నవీన్​ తనకు బెయిల్​ మంజూరు చేయాలని నాంపల్లి ఏసీబీ కోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంలో కౌంటర్​ దాఖలు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు అతనికి బెయిల్​ మంజూరు చేయవద్దని కోరారు. కేసులో శివబాలకృష్ణకు ప్రధాన బినామిగా అతని సోదరుడు శివ నవీన్​ ఉన్నారని కేసు దర్యాప్తు దశలో ఉందని ఏసీబీ తరుఫు న్యాయవాది తెలిపారు. నిందితుడు నుంచి కీలకమైన సమాచారం సేకరించాల్సి ఉందని పేర్కొన్నారు.

శివబాలకృష్ణ బినామీలను విచారిస్తున్న ఏసీబీ - ఆ ఇద్దరి పేరు మీద అనేక భూములు, స్థలాలు!

Siva Balakrishna Brother Bail Issue : మరోవైపు అరెస్ట్​ చేసిన సమయంలో శిన నవీన్​(Siva Naveen Bail Petition)ను విచారించారని నిందుతుడు తరుఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశాడు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిందితుడికి బెయిల్​ పిటిషన్​ను తిరస్కరించింది. ఈ కేసులో శివబాలకృష్ణ బినామీలపై ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా అతని బినామీలుగా ఉన్న సత్యనారయణ మూర్తి, బంధువు భరత్​లను రెండు రోజులు అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయంలో విచారించింది. వారి వాంగ్మూలాలను రికార్డు చేసింది.

శివబాలకృష్ణ కేసు లేటెస్ట్ అప్డేట్​ - ఆ ఐఏఎస్ అధికారిని విచారించే యోచనలో ఏసీబీ

Siva Balakrishna Bail Petition : ఈ కేసులో బెయిల్​ కావాలని ప్రధాన నిందితుడు కోర్టును ఆశ్రయించగా నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అతను ప్రస్తుతం చంచల్​గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కస్టడీ విచారణ, ఆధారాలను ఏసీబీ సేకరించిందని బెయిల్ మంజూరు చేయాలని శివబాలకృష్ణ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నమోదైన కేసులో మరింత లోతుగా విచారించాల్సింది ఉందని ఏసీబీ తరఫు న్యాయవాది చెప్పారు. బినామీ ఆస్తుల వివరాలు సేకరించాల్సి ఉందని ఏసీబీ కోర్టుకు(Nampally ACB Court) తెలిపింది. ఈ కేసులో కీలక వ్యక్తులు ఉన్నారనే సమాచారం ఉందని, విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్​ ఇవ్వవద్దని కోర్టును విజ్ఞాప్తి చేసింది. ఇలాంటి సమయంలో బెయిల్​ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, ప్రధాన నిందుతుడికి కూడా బెయిల్​ పిటిషన్​ను కొట్టివేసింది.

ఐఏఎస్‌తో శివబాలకృష్ణ అవినీతి బంధం - ఇద్దరి లావాదేవీలు తేల్చే పనిలో ఏసీబీ!

Last Updated : Feb 16, 2024, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.