HMDA Ex Director Balakrishna Remand Report : అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో హెచ్‌ఎండీ మాజీ డైరెక్టర్, మెట్రో రైల్ ప్లానింగ్(Metro Rail Planning) అధికారి శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో అవినీతి నిరోధక శాఖ అధికారులు కీలక విషయాలను ప్రస్తావించారు. రెండు రోజుల పాటు బృందాలుగా విడిపోయి మొత్తం 18చోట్ల సోదాలు చేసినట్లు తెలిపారు. సోదాల సమయంలో పలు చర, స్థిరాస్థులు గుర్తించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
Shiva Balakrishna Illegal Assets Details : అతని పేరుపై సోమాజిగూడలోని తులిప్స్ అపార్ట్మెంట్లో ప్లాట్, భార్య రఘు దేవి పేరిట ఘట్కేసర్ చందుపట్లగూడలోని 300గజాల స్థలం, కుమార్తె పేరిట నాగర్‌కర్నూల్‌లో రూ.18లక్షలు విలు చేసే వ్యవసాయ భూమి, చేవెళ్ల కందువాడలో 10కుంటల స్థలం, అతని కుమారుడు హరి ప్రసాద్ పేరిట చేవెళ్లలో 10 కుంటల స్థలాన్ని గుర్తించారు.
సోదరుడు నవీన్ కుమార్ పేరిట పుప్పల గూడలో ఓ విల్లా, సోదరి పేరిట శేరిలింగంపల్లిలో ఒక ఫ్లాట్‌ను గుర్తించారు. వీటన్నింటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 2.57కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. బహిరంగ మార్కెట్లో(Open Market) దీని విలువ సుమారు రూ.40కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ పేర్కొంది. కాగా సోదాలు చేసిన సమయంలో ఆస్తుల వివరాలు అడగగా, అవి తమ పేరుపై ఉన్నట్లుగా తమకు తెలీదని సమాధానం ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
బాలకృష్ణ అవినీతిపై సర్కార్ నజర్ - బినామీ ఆస్తులపై ఏసీబీ విచారణ
సోదాలు సమయంలో ఇంట్లో లభించిన 120 చేతి గడియారాల విలువే సుమారు రూ. 33లక్షలు ఉంటుందని ఏసీబీ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కింది. అదేవిధంగా శివ బాలకృష్ణ ఇంట్లో 155 సేల్ డీడ్ డాక్యుమెంట్లు, నాలుగు పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి బినామీలను(Benamis) విచారించాలని తెలిపారు. ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉందని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. రూ.51లక్షలు విలువ చేసే నాలుగు కార్లు సైతం స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.
సిద్దిపేట జిల్లా అల్లీపురానికి చెందిన నిందితుడు శివబాలకృష్ణ దిల్లీలోని దిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్‌లో మాస్టర్ డిగ్రీ (Master Degree) చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు హోదాల్లో పనిచేసిన శివబాలకృష్ణ 2021 నుంచి 2023 వరకూ హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్‌గా పని చేశాడు. 2023 జూలై నుంచి మెట్రోరైల్ ప్లానింగ్ అధికారిగా పని చేస్తున్నాడు. అతని సర్వీసులో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ వెల్లడించింది.
HMDA Ex Director Shiva Balakrishna Case Update : హెచ్‌ఎండీఏలో పనిచేసిన సమయంలో కొన్ని ప్రముఖ ఇన్‌ఫ్రా కంపెనీలకు అనుమతులు మంజూరి చేసి కోట్ల రూపాయలు గడించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కొంత డబ్బును ఇన్‌ఫ్రా కంపెనీల్లో(Infra Company) పెట్టుబడి పెట్టినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. బినామీ పేర్లపై ఆస్తులను కూడబెట్టారని తెలుసుకున్న అధికారులు ఇప్పటి వరకూ అతని స్నేహితులు, బంధువులు తెలిసిన వాళ్లకు సంబంధించి 34మందిపై ఉన్న ఆస్తుల వివరాలు రిమాండ్ రిపోర్ట్‌లో పొందుపరిచారు. వీటన్నింటిని పరిశీలించి బినామీ ఆస్తులు అని తేలితే జప్తు చేసే అవకాశం ఉంది.
చంచల్‌గూడ జైలుకు శివబాలకృష్ణ - బినామీలను విచారించడంపై ఏసీబీ ఫోకస్
బాలకృష్ణకు జ్యూడిషియల్ రిమాండ్ - ఏసీబీ సోదాల్లో రూ.100 కోట్లకుపైగా ఆస్తులు