ETV Bharat / state

ఓవైపు ఎండ - మరోవైపు వాన - తెలంగాణలో విచిత్ర వాతావరణం - Weather in Nirmal District - WEATHER IN NIRMAL DISTRICT

Telangana weather Report : రాష్ట్రంలోనే అత్యధికంగా నిర్మల్‌ జిల్లాలో శనివారం భానుడు నిప్పులు కురిపించాడు. జిల్లాలోని కుభీర్‌ మండల కేంద్రంలో 45.6 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. మరోవైపు రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలిక పాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Highest Temperature in Nirmal
Telangana weather Report (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 26, 2024, 4:09 PM IST

Highest Temperature in Nirmal : నిర్మల్‌ జిల్లా శనివారం నిప్పుల కొలిమిలా మండింది. ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు దంచి కొట్టాయి. రాష్ట్రంలోనే కుభీర్‌ మండల కేంద్రంలో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. నిర్మల్‌ గ్రామీణ జిల్లా ముజిగిలో 45.2, తానూరు మండల కేంద్రంలో 44.8 నమోదు కాగా కడెం పెద్దూరులో 44.7, బాసరలో 44.3 డిగ్రీల ఎండ కాసింది. కామారెడ్డి జిల్లా వర్ని మండలం జాకోరాలో 44.8, ఆదిలాబాద్‌ జిల్లా బేల మండల కేంద్రంలో 44.7, జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం అల్లీపూర్‌లో 44.9, మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్‌లో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి : ఈ నెల 24 నుంచి 25 ఉదయం వరకు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో 4.8 సెం.మీ, మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలో 4.6, నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలం కొండనాగులలో 2 సెంటీ మీటర్ల వర్షం పడింది. వనపర్తి, నారాయణపేట, సిద్దిపేట, కుమురం భీం ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. మరోవైపు రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

తేలికపాటి జల్లులు కురిసే సూచనలు : ఈ ఆదివారం నుంచి పగటి పూట ఉష్ణోగ్రతలు క్రమేపి రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కింది స్థాయి గాలులు పడమర, వాయువ్య దిశల నుంచి వీస్తున్నాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు నైరుతి, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వివరించింది. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ వివరించింది. మరోవైపు ఇవాళ కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడనుంది. గత వారం రోజుల కింద కురిసిన వర్షానికి హైదరాబాద్​లో పలుచోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. జీహెచ్ఎంసీ అధికారులు సైతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

నేడు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు - TELANGANA WEATHER REPORT TODAY

ఏపీలో పలుచోట్ల వర్షాలు - ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు - Heavy Rain Alert To AP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.