ETV Bharat / state

వారికి చట్టప్రకారం నోటీసులు ఇచ్చి, దర్యాప్తు కొనసాగించండి - సైబరాబాద్​ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు - high court on hydra

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 10:08 AM IST

HYDRA Case Against Govt Employees : చెరువుల ఆక్రమణలకు సహకరించారంటూ ప్రభుత్వ ఉద్యోగులపై హైడ్రా ఆగస్టు 30న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చట్ట ప్రకారం దర్యాప్తు చేయాలని హైకోర్టు సైబరాబాద్​ పోలీసులను ఆదేశించింది. నిందితులకు నోటీసులు జారీ చేసి, వారి వివరణ, ఆధారాలను తీసుకొని వాటితో పాటు అభియోగ పత్రం దాఖలు చేయాలని ఆదేశించింది.

HYDRA case against govt employees
HYDRA case against govt employees (ETV Bharat)

HYDRA Case Against Govt Employees Ponds Encroachment : చెరువుల ఆక్రమణలకు సహకరించారంటూ హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన కేసుల్లో చట్ట ప్రకారం నోటీసులు జారీ చేసి దర్యాప్తు కొనసాగించాలంటూ సైబరాబాద్​ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితులకు నోటీసులు జారీ చేసి వారి వివరణ, ఆధారాలను తీసుకొని వాటితో పాటు అభియోగ పత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. రంగనాథ్​ ఫిర్యాదు మేరకు సైబరాబాద్​ ఆర్థిక నేర విభాగం పోలీసులు ఆగస్టు 30న నమోదు చేసిన క్రిమినల్ కేసును కొట్టి వేయాలని కోరుతూ మేడ్చల్ మల్కాజిగిరి సర్వే డిపార్టుమెంట్​కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ కె. శ్రీనివాసులు, మరో ప్రభుత్వ ఉద్యోగి పూల్​ సింగ్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

వీటిపై జస్టిస్ కె.సుజన విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది టి.శ్రీకాంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు నిబంధనల ప్రకారమే వ్యవహరించారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి నిందితులపై నమోదైన అభియోగాలన్నీ 7 ఏళ్లలోపు శిక్ష పడేవనని, చట్ట ప్రకారం నోటీసులు జారీ చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. నిందితులు దర్యాప్తు అధికారులకు సహకరించాలని, అవసరమైనప్పుడు నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలను సమర్పించి తమపై ఆరోపణలపై వివరణ ఇవ్వవచ్చన్నారు. పిటిషనర్లు సమర్థించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకుని మేజిస్ట్రేట్​కు సమర్పించే తుది నివేదికతో జత చేయాలని ఆదేశిస్తూ పిటిషన్లపై విచారణను మూసి వేశారు.

ఇప్పటివరకు 262 నిర్మాణాలు కూల్చివేత : చెరువుల రక్షణ, ప్రభుత్వ భూములు కాపాడడం వంటి వాటిపై ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ హైడ్రా ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటివరకు 262 ఆక్రమ నిర్మాణాలను కూల్చేసింది. ఇందులో జీహెచ్​ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో నిర్మాణాలు కూల్చేసి 111.72 ఎకరాల స్థలాన్ని పరిరక్షించినట్లు ప్రభుత్వానికి నివేదికను హైడ్రా సమర్పించింది.

హైడ్రా గత రెండు నెలలుగా చెరువుల ఎఫ్​టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాల పనిపడుతున్న హైడ్రా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తోంది. రాంనగర్ మణెమ్మ గల్లీలో 3, గగన్ పహాడ్ అప్పా చెరువులో 14, అమీన్​పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్ సున్నం చెరువులో 42, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు హైడ్రా వెల్లడించింది. అత్యధికంగా అమీన్​పూర్​లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువులో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా పేర్కొంది.

'హైడ్రా'కు ఎవరూ అడ్డు చెప్పకుండా ప్రత్యేకంగా ఓ చట్టం! - త్వరలోనే ఆర్డినెన్స్ జారీ!! - Hydra With More Powers

'ఇప్పటివరకు 262 అక్రమ నిర్మాణాల కూల్చివేత' - ప్రభుత్వానికి హైడ్రా లేటెస్ట్ రిపోర్టు - HYDRA DEMOLITIONS REPORT LATEST

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.