ETV Bharat / state

హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్ - సంధ్య థియేటర్‌ కేసును కొట్టివేయాలంటూ పిటిషన్ - ALLU ARJUN SANDHYA THEATER CASE

హైకోర్టును ఆశ్రయించిన హీరో అల్లు అర్జున్‌ - సంధ్య థియేటర్‌ కేసును కొట్టివేయాలని పిటిషన్‌

Hero Allu Arjun Approaches High Court to Dismiss Sandhya Theater Case
Hero Allu Arjun Approaches High Court to Dismiss Sandhya Theater Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2024, 6:41 PM IST

Updated : Dec 11, 2024, 7:27 PM IST

Hero Allu Arjun Approaches High Court to Dismiss Sandhya Theater Case : హీరో అల్లు అర్జున్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4న సంధ్యా థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందారు. ఈ ఘటనతో ఆయనతో పాటు థియేటర్‌ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అందులో పేర్కొన్నవన్ని అవాస్తవం : ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న విషయాలు అవాస్తవాలని ప్రీమియర్‌ షోకు వస్తున్నట్లు పోలీసులకు ముందే సమాచారమిచ్చినట్లు అల్లు అర్జున్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. అల్లు అర్జున్‌ పేరొందిన ప్రముఖ హీరో అని అభిమానులతో కలిసి గతంలోనూ చిత్రాలు చూశారని ఆయన తరఫు న్యాయవాది పిటీషన్‌లో తెలిపారు. సంధ్య థియేటర్‌లో పుష్ప-2 చిత్రం ప్రీమియర్ షో చూసేందుకు వస్తున్నట్లు ఈ నెల 2వ తేదీన ఏసీపీ, థియేటర్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చినట్లు వివరించారు.

పలు సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధం : ప్రీమియర్ షో సందర్భంగా బందోబస్తులో ఏసీపీతో పాటు డీసీపీ సైతం సంధ్య థియేటర్‌ వద్ద ఉన్నారని, ఆయన రావడం వల్లే తొక్కిసలాట జరిగిందనడంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ పేరు చేర్చడం పలు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. అల్లు అర్జున్ పేరు చేర్చుతూ నమోదు చేసిన కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. తదుపరి దర్యాప్తు చేపట్టకుండా తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై రేపు విచారణ నిర్వహించే అవకాశం ఉంది.

బెనిఫిట్ షో రోజు ఘటన : ఈ నెల 4న పుష్ప-2 బెనిఫిట్​ షోను చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్​ వద్ద రాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మరణించారు. బెనిఫిట్​ షో కోసం హీరో అల్లు అర్జున్​ రావడంతో తమ స్టార్​ హీరోను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకోవడంతో, పరిస్థితిని కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేసి అభిమానులను చెదరగొట్టారు.

సంధ్య థియేటర్‌ ఘటనపై స్పందించిన అల్లు అర్జున్‌ - రేవతి కుటుంబానికి రూ.25 లక్షల సాయం

తొక్కిసలాటలో తల్లికుమారుడు : పోలీసులు ఒక్కసారిగా అందరిని చెదరగొట్టే సమయంలో తొక్కిసలాట జరగడంతో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు కింద పడిపోయారు. జనాల కాళ్ల మధ్య నలిగిపోయారు. వారిద్దరికి తీవ్రగాయాలు కావడంతో సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అక్కడ జనాలను క్లియర్‌ చేసి తల్లీకుమారులను పోలీసులు పక్కకు తీసుకెళ్లి సీపీఆర్‌ చేశారు. దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తల్లి మృతి చెందగా ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా ఉండడంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

'పుష్ప' తీసిన ప్రాణం : సంధ్య థియేటర్​కు అల్లుఅర్జున్ - తొక్కిసలాటలో మహిళ మృతి

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్​పై కేసు నమోదు

Last Updated : Dec 11, 2024, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.