Heavy Rush Of devotees in Tirumala : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు భారీ ఎత్తున బారులు తీరారు. వీరికి శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. దీంతో క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. ఈ రద్దీ వారాంతం వరకు కొనసాగే అవకాశం ఉంది.
VIP Break Darshans on weekends are cancelled : తిరుమలకు ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరిగింది. వేసవి సెలవులు ముగియనుండటం, ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోవాలంటే సుమారు 30-40 గంటల సమయం క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సామాన్య భక్తుల కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న తితిదే : భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు గాను జూన్ 30వ తేదీ వరకు శని, ఆది వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనంను రద్దు చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది. దేశంలోనే అత్యధికమంది యాత్రికులు సందర్శించే పుణ్యక్షేత్రాలో తిరుమల క్షేత్రం ఒకటి. దీనికి భక్తులు కలియుగవైకుంఠంగా భావిస్తుంటారు. వేసవి సెలవులు మరో 15 రోజుల్లో ముగుస్తుండడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. దీంతో ఒక్కసారిగా తిరుమలలో రద్దీ పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం.. తిరుపతిలో టోకెన్ల జారీ ప్రారంభం
TIRUMALA: శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు.. స్వామివారి సేవలో పలువురు ప్రముఖులు