ETV Bharat / state

రాగల మూడు రోజులు తెలంగాణలో వానలే వానలు - అప్రమత్తమైన అధికారులు - Heavy Rain Alert To Telangana - HEAVY RAIN ALERT TO TELANGANA

Heavy Rain Alert To Hyderabad : రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా జీహెచ్​ఎంసీ మేయర్ విజయలక్ష్మీ ఆయా అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

Heavy Rain Alert to Telangana
Heavy Rain Alert to Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 20, 2024, 7:19 PM IST

Heavy Rain Alert to Telangana : రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఉమ్మడి అదిలాబాద్, మెదక్, మహబూబ్​నగర్​తో పాటు వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు యెల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఈ నెల 24న ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రం మీద నుంచి కొనసాగిన ఆవర్తనం, ద్రోణి బలహీన పడ్డాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Rain Alert To Hyderabad : హైదరాబాద్ నగరంలో సాయంత్రం మరోసారి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్​బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపుల్​ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. దీంతో ఎక్కడ ట్రాఫిక్ అక్కడ నిలిచిపోయింది. రోడ్లపై వాన నీరుతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్​లో తెల్లవారుజాము నుంచి కురిసిన భారీవర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. రోడ్లన్ని చెరువులుగా మారడంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మళ్లీ సాయంత్రం కురిసిన వాన వాహనదారులను ఇబ్బందులు పెట్టింది.

ముషీరాబాద్​ను ముంచెత్తిన వరద - ఇళ్లలోకి చేరిన వర్షపునీరు - HYDERABAD FLOODS 2024

జీహెచ్ఎంసీ అధికారులతో మేయర్​ టెలికాన్ఫరెన్స్​ : నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జీహెచ్​ఎంసీ అప్రమత్తమైంది. వర్షాల దృష్ట్యా జోనల్ కమిషనర్లతో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ టెలికాన్ఫరెన్స్​ నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలని, వాటర్​ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు నిలిస్తే వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. డ్రైనేజీలు నిండితే వెంటనే పరిష్కరించాలని అన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తపడాలని సూచించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందితే వారికి వెంటనే అందుబాటులోకి వెళ్లాలని అన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవరసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని మేయర్ తెలిపారు.

హైదరాబాద్​లో భారీ వర్షం - నిండుకుండులా హుస్సేన్ సాగర్ - 4 గేట్లు తెరిచి నీటివిడుదల - HUSSAIN SAGAR GATES OPENED

జలమయమైన హైదరాబాద్ - వరదలో కొట్టుకుపోయిన బైకర్ - కాపాడిన లోకల్స్ - BIKER WASHED AWAY IN HYDERABAD

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.