Heavy Rains In Telangana Coming Two Days : తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, హైదరాబాద్‌తో పాటు మేడ్చల్ - మల్కాజిగిరి, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. బుధవారం దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ధ నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల నుంచి 3.1 కిలో మీటర్ల మధ్య కేంద్రీకృమైన చక్రవాతపు ఆవర్తనం గురువారం అదే ప్రాంతంలో కొనసాగుతున్నట్లు వెల్లడించింది.
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం - ఆ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు!
మెదక్ జిల్లా రామాయంపేటలో అకాల వర్షం దంచికొట్టడంతో మార్కెట్ యార్డు, రోడ్లపై కర్షకులు ఆరబోసిన ధాన్యం తడిసి వరద నీటి పాలైంది. ఆరుగాలం కష్టపడిన పంట కళ్లముందే కొట్టుకుపోతుంటే రైతులు ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు. ధాన్యం రాశుల్లో ఉన్న నీటిని తీసేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షంలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులుపడ్డారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా, తూకం వేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు చొరవ చూపించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం - మరో రెండురోజుల పాటు ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఆ జిల్లాల్లో మళ్లీ టెన్షన్ టెన్షన్