Rains in Telangana 2024 : ఇన్నాళ్లు రికార్డు స్థాయి ఎండలతో ఉడికిపోయిన పలు జిల్లాలు వర్షపు చినుకులతో కాస్త చల్లబడగా, మరికొన్ని జిల్లాలో వడగళ్ల వాన కురిసింది. అత్యధికంగా నల్గొండ జిల్లాల తిప్పర్తి మండలం మామిడాలలో 6.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో 4.7 సెంటీమీటర్ల వర్షం పడింది. పలు జిల్లాలో కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, వరి ధాన్యం తడిచిపోయింది. ఇవాళ పలు జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Crop Loss To Rains in Telangana : వరంగల్ జిల్లా కేశవపురంలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి మామిడి నేలరాలింది. అకాల వానలతో ములుగు జిల్లా ఏటూరునాగారంలోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. ఆరబోసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతోనే ఇలా జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిచిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కర్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏటూరునాగారానికి చెందిన బుల్లెయ్య అనే రైతు, మిర్చి కల్లం వద్ద పిడుగు పడటంతో అక్కడే మృతి చెందాడు. వెంకటాపురం, మంగపేటలో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు వీచాయి. వాజేడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన చిలకమ్మ అనే మహిళ పిడుగుపాటుతో అస్వస్థతకు గురికాగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Crop Damage: అరిగోస.. వానలు ఆగవాయే.. పరిహారం రాదాయే
జనగామ జిల్లాలో పలుచోట్ల చోట్ల పిడుగులు పడ్డాయి. కోడూరు గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడు పిడుగుపాటుతో మృతి చెందాడు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చాగల్‌లో వ్యవసాయ బావి వద్ద కట్టేసిన కాడెద్దుపై పిడుగుపాటుతో మృతి చెందింది. మహబూబాబాద్ జిల్లా రాయపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలోని తాడిచెట్టుపై పిడుగు పడింది.
పలు జిల్లాలో భారీ వర్షం : నల్గొండ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. నల్గొండ, చిట్యాల, నకిరేకల్, నాంపల్లి, చండూరు సహా నూతనకల్, నార్కట్‌పల్లి, గుండాలలో భారీ వర్షం పడింది. వర్షానికి పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. సూర్యాపేట జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలకు ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు కూలిపోవడంతో కొద్దిసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
రహదారులపై విరిగిపడ్డ స్తంభాలు : సూర్యాపేట - దంతాలపల్లి రహదారిపై రహదారిపై భారీగా చెట్లుకూలగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పోలీసులు శ్రమించి రోడ్డుకు అడ్డుగా చెట్లు తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఈదురుగాలులతో చెట్లకొమ్మలు కరెంట్ తీగల మీద పడగా స్తంభాలు విరిగి రహదారిపై పడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
చల్లా సముద్రంలో ట్రాక్టర్‌పై చెట్టుపడగా గాలి బీభత్సానికి పలుగ్రామాల్లో ఇంటిపైకప్పులు ఎగిరిపోయాయి. వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయ వీఐపీ రోడ్డుమార్గంలో భారీ చింతచెట్టు ప్రమాదవశాత్తు నేలకూలింది. చెట్టు కింద నిలిపి ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. చెట్టు కూలిన సమయంలో వాహనాల్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
High Wind Havoc in Joint Warangal : ఈదురు గాలుల బీభత్సం.. 150కి పైగా ఇళ్లు ధ్వంసం
Heavy Rains In Telangana : మళ్లీ విరుచుకుపడిన అకాల వర్షం.. తడిసి ముద్దయిన ధాన్యం