ETV Bharat / state

ఏపీలో మరో విపత్తు! - ఈ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు - మరో 4 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం, ఆందోళనలో రైతులు

Heavy Rains Effects in AP 2024
Heavy Rains Effects in AP 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 14, 2024, 7:30 PM IST

Updated : Oct 14, 2024, 7:43 PM IST

Heavy Rains Effects in AP 2024 : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆనుకున్న ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఆవర్తనం ఏర్పడి ఏపీవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, విశాఖ, కడప, అన్నమయ్య జిల్లాల్లో పంట పొలాలు నీటమునిగాయి. రోడ్లు జలదిగ్బంధమయ్యాయి. వర్షాలు భారీగా కురుస్తున్న జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలో పలుచోట్ల వానలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో జనజీవం అస్థవ్యస్థమవుతోంది. అనేక చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రులు, అధికారులు సూచిస్తున్నారు. కంట్రోల్‌రూమ్స్‌ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు క్షుణ్నంగా పర్యవేక్షిస్తున్నారు.

అత్యవసరమైతే తప్ప బయటకు ఎవరూ రావొద్దు : నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో ప్రజలు అత్యవసరమైతే మినహా బయటకు ఎవరూ రావొద్దని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి విజ్ఞప్తి చేశారు. ఆవర్తన ప్రభావంతో అన్నమయ్య జిల్లాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్​రెడ్డి సూచించారు.

ఏపీలోని వర్షం పరిస్థితిని విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి ప్రధాన కార్యదర్శి నీరభ్​కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్ సిసోదియా పర్యవేక్షిస్తున్నారు. విపత్తు వేళ తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్‌, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, ఆర్​అండ్​బీ అధికారులు అలెర్ట్​గా ఉండాలని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ వెంటనే వెనక్కి రప్పించాలని ఆఫీసర్లను ఆదేశించారు.

ఈదురుగాలుల తీవ్రతను బట్టి పవర్​ డిపార్ట్​మెంట్​ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. భారీ వర్షాల ప్రభావంతో కాలువలు, వాగులు పొంగే రోడ్లను వెంటనే మూసేయాలని ఆదేశించారు. ప్రమాదకరమైన కల్వర్టుల వద్ద ఇండికేషన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో నివాసముండే వారిని సచివాలయ సిబ్బంది సేఫ్​ ప్రదేశాలకు తరలించాలని చెప్పారు. కాలువలు, చెరువులు, వాగుల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

నీటమునిగిన పంటపొలాలు, రహదారులు : గతరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లా జలసంద్రమైంది. నెల్లూరు, కావలి, కందుకూరు, మనుబోలు, కోవూరులో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపునీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలుపడ్డారు. కావలి ట్రంక్ రోడ్డు, పాతశివాలయం వీధిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షపు నీరు ముంచెత్తింది. అనేకచోట్ల డ్రైనేజీలు నిండి రహదారులపై మురుగునీరు ప్రవహిస్తోంది. మర్రిపాడులో మన్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తుమ్మల పంట సముద్రతీరంలో 20 మీటర్ల వరకు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు సముద్రపు వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ప్రకాశం జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జిల్లాలోని అన్ని రహదారులు, పంటపొలాలు నీటమునిగాయి. గుండ్లకమ్మ కాలువ ప్రవాహం పెరిగింది. ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్‌, కర్నూలు రోడ్డులో మోకాళ్ల లోతు నీరు నిలిచింది. గిద్దలూరు, మార్కాపురం, టంగుటూరు, కొండపి, సంతనూతలపాడులో పంట పొలాలు నీటమునిగాయి. బాపట్ల జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.

మరో 4 రోజులపాటు వర్షాలు - ఆందోళనలో రైతులు : ఆదివారం రాత్రి నుంచి కడప జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తోంది. కడప, బద్వేలులో తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షాలకు రోడ్లు నీటమునిగాయి. వర్షాల వల్ల చిరువ్యాపారులు, తోపుడుబండ్ల వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. అన్నమయ్య జిల్లాలోని పలు మండలాల్లో 3 రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, చిట్వేలి, పెనగలూరు మండలాల్లో ఉద్యాన పంటల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరో 4 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో బొప్పాయి, అరటి, మామిడికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం - భారీవర్షాలతో బిక్కుబిక్కుమంటున్న కోస్తా జిల్లాలు

తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ - 3 రోజుల పాటు వానలు

Last Updated : Oct 14, 2024, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.