ETV Bharat / state

భారీ వరదకు ఇంటికన్నె - కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్‌ ధ్వంసం - నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు - Heavy Rain in Mahabubabad - HEAVY RAIN IN MAHABUBABAD

Rain in Mahabubabad Today : మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఇనుగుర్తిలో అత్యధికంగా 29.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో మహబూబాబాద్-నెల్లికుదురులతో పాటు పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. రావిరాలలో పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో జనజీవనం స్తంభించిపోయింది.

Heavy RainFall in Mahabubabad Today
Rain in Mahabubabad Today (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 9:59 AM IST

Updated : Sep 1, 2024, 11:47 AM IST

Heavy RainFall in Mahabubabad Today : మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల రాకపోకలు సైతం నిలిచిపోయాయి. మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి, మసి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తళ్లు పారుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అత్యధికంగా ఇనుగుర్తి మండల కేంద్రంలో అత్యధికంగా 29.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ శివారు కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్యలో రైలు పట్టాలపై వరద ప్రవహించడంతో కంకర కొట్టుకుపోయింది.

దీంతో రైల్వే ట్రాక్‌ ధ్వంసమై విజయవాడ-కాజీపేట మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ నుంచి అన్ని వైపులా రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు మండలం రావిరాలలో చెరువు మత్తడి పోయడంతో పలు ఇళ్లలోకి నీరు చేరి, నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి. చెక్ డ్యామ్​లు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో కల్వర్టుల వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి పహారా కాస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కేసముద్రం మండలలో పలు ఇళ్లల్లో, దుకాణాల్లోకి వరద నీరు చేరింది.

గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు : మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండల కేంద్రం శివారులో పాకాల వాగు పొంగి ప్రవహిస్తుండటంతో గూడూరు నుంచి కేసముద్రం, నెక్కొండ, గార్ల నుంచి రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు మండలం రావిరాలలో పలు ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికారుల ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్​ను ఏర్పాటు చేశారు. అత్యవసరం ఉంటే ప్రజలు 7995074803 నంబర్​కు ఫోన్​ చేయాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ అధ్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు - లోతట్టు ప్రాంతాలు జలమయం - స్తంభించిన జనజీవనం - Heavy Rain in Telangana

హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై వరదనీరు - కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్‌ - Vehicles Stuck at Kodada highway

Last Updated : Sep 1, 2024, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.