ETV Bharat / state

తెలంగాణ ప్రజలకు అలర్ట్ - ఇవాళ, రేపు వానలే వానలు - TELANGANA RAIN ALERT TODAY - TELANGANA RAIN ALERT TODAY

Telangana Heavy Rains Today : రాష్ట్రంలోని పలు జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Telangana Heavy Rains
TELANGANA FORECAST TODAY (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 12, 2024, 9:40 AM IST

Telangana Heavy Rains : రాష్ట్రంలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో 16 జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని వాటి వివరాలను తెలిపింది. ఆయా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Hyderabad IMD Weather Report : రాష్ట్రంలో గురువారం కూడా పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్​, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్​, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్గాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు రోజులు గాలుల వేగం 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉంటుందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంటుందని అప్రమత్తం చేసింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​కు అంతరాయం కలిగే అవకాశం ఉందని సూచించింది.

తెలంగాణ ప్రజలకు అలర్ట్ - ఆ 13 జిల్లాల్లో భారీ వర్షాలు - Rain Alert in Telangana

Telangana Rains Effect : రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం వర్షాలు పడ్డాయని తెలిపిన వాతావరణ శాఖ జిల్లాలో నమోదైన వర్షపాతం శాతం వివరాలను విడుదల చేసింది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో 6.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావ్‌పేటలో 6.5, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడలో 6.5, మెదక్‌ జిల్లా ఎల్దుర్తిలో 6, తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌లో 5.8, శంకరంపేటలో 5.1 సెం.మీ. కురిసింది. జిల్లాలలో కురిసిన వర్షానికి సిద్దిపేట జిల్లాలో ఓ రైతు, మెదక్​ జిల్లాలో ఓ మహిళ ఇద్దరు పిడుగుపాటు గురై మృతి చెందారు. భాగ్యనగరంలో ఆకస్మత్తుగా కురిసిన వర్షం వల్ల చార్మినర్ వద్ద పర్యాటకులు ఇబ్బంది పడ్డారు.

హైదరాబాద్​లో భారీవర్షం - పలుచోట్ల ట్రాఫిక్ జామ్ - Many Places Rain in Hyderabad

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.