ETV Bharat / state

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం - అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి - Heavy Rains in Hyderabad

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 9:03 PM IST

Updated : Aug 15, 2024, 10:04 PM IST

Heavy Rains in Hyderabad : హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లడంతో పాటు, ట్రాఫిక్ జామ్​​తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Heavy Rainfall Alert in Telangana
Heavy Rains in Hyderabad (ETV Bharat)

Heavy Rains in Hyderabad : హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లడంతో పాటు, ట్రాఫిక్ జామ్​​తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సెలవు రోజు కావడంతో సాయంత్రం ఇంటి నుంచి బయటికొచ్చిన నగరవాసులు తడిసి ముద్దయ్యారు. మరికాసేపట్లో హైదరాబాద్‌లో మరింత భారీ వర్షం కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు : జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎస్‌ఆర్‌నగర్‌, మధురానగర్‌, సనత్‌నగర్‌, ఈఎస్‌ఐ, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, గాంధీ నగర్‌, కవాడీగూడ, దోమలగూడ, జగద్గిరిగుట్ట, షాపూర్‌, జీడిమెట్ల, బాలానగర్‌, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, సూరారం, బహదూర్‌పల్లి, కూకట్‌పల్లి, ఆల్వీన్‌కాలనీ, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, బాచుపల్లి, ప్రగతినగర్‌, కేపీహెచ్‌బీ కాలనీ, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, బషీర్‌బాగ్‌, అబిడ్స్‌, నాంపల్లి, కోఠి, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్‌, ప్యాట్నీ, ప్యారడైజ్‌, బేగంపేట్‌, చిలకలగూడ, మారేడ్‌పల్లి, మేడ్చల్‌, కండ్లకోయ, కృష్ణాపూర్‌, దుండిగల్‌, గండిమైసమ్మ, మలక్ పేట్, చంపాపేట్, సైదాబాద్, చైతన్యపురి, సంతోష్ నగర్‌, కొత్తపేట, సరూర్ నగర్, ఎల్బీనగర్‌, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది.

అవసరమైతేనే బయటకు రండి : భారీ వర్షం కురవడంతో జీహెచ్​ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. అత్యవసరసమైతే తప్ప ప్రజలు ఇల్లు విడిచి బయటకు రావొద్దని సూచించారు. వర్షానికి సంబంధించి ఏమైనా అత్యవసర సహాయం అవసరమైతే 040-21111111, 9000113667 ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు.

Heavy Rainfall Alert in Telangana : మరోవైపు రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం అక్కడక్కడా కురిసే అవకాశాలున్నాయని వివరించింది. ఈ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

రాష్ట్రంలో రాగల మూడు రోజులు వానలే! - ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు ! - Rain Alert in Telangana

Last Updated : Aug 15, 2024, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.