ETV Bharat / state

అమ్మా నా యూనిఫామ్ తడిసిపోతుంది - ప్లీజ్ నన్నెత్తుకోవా? - Hyderabad Rains Today - HYDERABAD RAINS TODAY

Heavy Rainfall in Hyderabad : భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఉదయం కురిసిన వానకు నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు వర్షంలో తడుస్తూ వారి వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. మరోవైపు బాలలు బడికి వెళ్లటానికి, వారి తల్లిదండ్రులు చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఆ సంగతేంటో చూద్దామా!

Heavy Rainfall in Hyderabad
People Suffered Many Problems due to Heavy Rains (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 13, 2024, 10:55 AM IST

Updated : Aug 13, 2024, 12:24 PM IST

People Suffered Many Problems due to Heavy Rains : రాజధాని హైదరాబాద్ మహానగరంలో చినుకు పడితే చాలు చిత్తడే. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. డ్రైనేజీలు జలమయంగా మారి చిన్నపాటి వాగుల్లా పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్​లో ఇవాళ ఉదయం కురిసిన భారీ వానకు నగరం తడిసిముద్దయింది. కురిసింది కొద్ది గంటలే అయినా ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టింది. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తెగ ఇబ్బందులు పడ్డారు.

Heavy Rainfall in Hyderabad
బడికి వెళ్లాలంటే - అమ్మా నన్నెత్తుకో (ETV Bharat)

మరోవైపు విద్యార్థులు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి ఎదురైంది. దీంతో చిన్నారులను బడులకు పంపేందుకు వారి తల్లిదండ్రులు ఆపోసోపాలు పడ్డారు. ఈ క్రమంలోనే యూసఫ్​గూడ శ్రీ కృష్ణానగర్​లో కొన్ని సంఘటనలు ఈటీవీ భారత్​ కెమెరాకు చిక్కాయి. తమ పిల్లలను వరదలో తడవకుండా ఎత్తుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి. కాసేపు దంచికొట్టిన వానతో నగరం అస్తవ్యస్తమైంది.

Heavy Rainfall in Hyderabad
వరద నీటిలో సైకిల్​పై రయ్​ రయ్​ (ETV Bharat)
Heavy Rainfall in Hyderabad
చిన్నారిని ఎత్తుకొని బడికి తీసుకెళ్తున్న తండ్రి (ETV Bharat)

Hyderabad Rains Today : సికింద్రాబాద్​లోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రైల్వే స్టేషన్ చిలకలగూడ ప్యాట్నీ ప్యారడైజ్ బేగంపేట్ మారేడుపల్లి ప్రాంతాలలో వర్షం పడింది. అలానే కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లకిడికపుల్, ఖైరతాబాద్ హిమాయత్ నగర్, నారాయణ గూడ తదితర ప్రాంతాల్లో కూడా వర్షం భారీగా కురిసింది.

Hyderabad Rains Today
మ్యాన్​హోల్​ నుంచి పొంగుతున్న వర్షపు నీరు (ETV Bharat)

ఉదయం కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, లక్డీకాపుల్, రవీంద్రభారతి పరిసరాల్లో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి కురిసిన వర్షానికి రోడ్డుపై వర్షపు నీరు నిలిచింది. ట్రాఫిక్ జామ్​తో వివిధ పనులపై వెళ్లిన ప్రభుత్వ, ప్రవేటు ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిదానంగా వాహనాలు కదులుతున్నాయి.

Hyderabad Rains Today
వాగుల్లా మారిన నగరపు రోడ్లు (ETV Bharat)

Last Updated : Aug 13, 2024, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.