ETV Bharat / state

ఇదెక్కడి 'రెడ్ అలర్ట్' సామీ - అత్యంత భారీ వర్షాలంటే కనీసం చుక్క కూడా పడలే - పైగా ఎటు చూసినా? - TAMIL NADU WEATHER CHANGING

తారుమారైన వాతావరణ శాఖ అంచనాలు - అత్యంత భారీ వర్షాలని ప్రకటించగా చుక్క కూడా పడని వర్షం - అవాక్కయిన ప్రజలు

Heavy Rain Forecast in Tamil Nadu but Not a Single Drop of Rain Fall
Heavy Rain Forecast in Tamil Nadu but Not a Single Drop of Rain Fall (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2024, 3:07 PM IST

Updated : Oct 19, 2024, 6:51 AM IST

Heavy Rain Forecast in Tamil Nadu but Not a Single Drop of Rain Fall : చెన్నై నగరానికి వాతావరణ శాఖ ఇచ్చిన వర్ష సూచనలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. 15న అతి భారీ వర్షాలు అంటూ ఆరెంజ్ అలర్ట్‌ ఇచ్చినా, అదేరోజు ఉదయం అత్యంత భారీ వర్షాలు సూచించే సరికి రెడ్‌ అలర్ట్‌గా మార్చారు. 16న అత్యంత భారీ వర్షాలొస్తాయని రెడ్‌ అలర్ట్ ఇచ్చినా, కనీసం నగరంలో చాలాచోట్ల వర్షాలు నమోదు కాకపోగా చుక్క వర్షం కూడా పడలేదు. ఈ తరహా వాతావరణ హెచ్చరికలతో నగరవాసులు గందరగోళానికి గురయ్యారు.

అంచనాలకు భిన్నంగా : వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా చెన్నైకి ఉత్తరం వైపుగా గురువారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో తీరం దాటినట్లు వెల్లడించారు. ఆ తర్వాత అది ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ప్రయాణించింది. తీరానికి దగ్గరగా వచ్చిన సమయంలో ఎలాంటి వర్షాలు కురవకుండా దాటేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మరోవైపు అది తీరం దాటగానే చెన్నైలో ఎండ రావడం మరో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇవన్నీ వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా జరిగాయి.

గురువారం చెన్నైలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వేసిన అంచనాలు తప్పాయి. చెన్నైతో పాటు కొన్ని జిల్లాల్ని అప్రమత్తం చేశారు. బుధవారం సీన్‌ మారడంతో గురువారం కూడా నగరంలో అలాంటి పరిస్థితులే కనిపించాయి. ఎక్కడా చుక్క వర్షం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగానే ఇవన్నీ జరగడం ఆశ్చర్యానికి గురి చేసింది. బుధవారం గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో కేవలం కొన్నిచోట్ల మాత్రమే మోస్తరు వానలు పడ్డాయి. మణలి, తిరువొత్తియూర్‌లో 3 సెంటీమీటర్లు, కత్తివాక్కం, తండియార్‌పేటలో 2 సెం.మీ., చెన్నై కలెక్టరేట్, రాయపురం, పెరంబూర్, అయనావరంలో సెం.మీ. వర్షపాతం నమోదైంది. 16న మధ్యాహ్నం నుంచి ఎక్కడా చుక్క వానే లేదు.

Tamil Nadu weather Report
వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలు (ETV Bharat)

వర్షం ఎంత కురిసిందో ఎలా తెలుస్తుంది? - ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లకు అర్థం తెలుసా?

హెచ్చరికలను గౌరవించాల్సిందే : విమర్శలు వచ్చినా వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలను గౌరవించాల్సిందేనని వాతావరణ నిపుణుడు ప్రదీప్‌ జాన్‌ అన్నారు. కొన్ని సందర్భాల్లో భారీ వర్షాలు పడతాయనే సూచన వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయని తెలిపారు. 16న అత్యంత భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటనతో తాను ఏకీభవించలేదన్నట్లు పేర్కొన్నారు. మనుషులు తమకున్న సాంకేతికత పరిజ్ఞానంతో ఊహించి అంచనాలు మాత్రమే వేయగలరని, కొన్ని మోడల్స్‌ ఆధారంగా వాతావరణ సూచనలు ఉంటాయని వివరించారు. తాను కూడా తనకున్న సామర్థ్యం మేరకు మాత్రమే వాతావరణ సూచనలు చెబుతూ వస్తున్నట్లు చెప్పారు. ఆయన అంచనాల ప్రకారం 15, 16 తేదీల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం దాటిన ప్రాంతాలు 75 వరకు ఉన్నాయని, ఇవన్నీ కూడా 24 గంటల్లో ఇంతటి వర్షపాతాన్ని నమోదు చేశాయని తెలిపారు.

రాష్ట్రంలో రేపు, ఎల్లుండి వానలు - ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ

ఏపీలో మరో విపత్తు! - ఈ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు

Last Updated : Oct 19, 2024, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.