ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు - జలకళను సంతరించుకున్న ప్రాజెక్టులు - tg projects filled with flood

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 21, 2024, 10:22 PM IST

Heavy Flood Water in Telangana Projects : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న వరద నీటితో రాష్ట్ర ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. వారం రోజుల క్రితం వరకు అడుగంటి ఉన్న జలాశయాలు అన్ని ఇప్పుడు నీటితో నిండి ఉన్నాయి. వరద నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు.

Heavy Flood Water in Telangana Projects
Heavy Flood Water in Telangana Projects (ETV Bharat)

Telangana Water Projects Filled with Flood Water : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. 5.52 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 85 గేట్లు ఎత్తి 5.52 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ నుంచి 66 గేట్లు ఎత్తి 16,850 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కృష్ణాపరివాహక ప్రాజెక్టులకు వరద రాక పెరిగింది.

ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి వస్తున్న వరద తాకిడితో జూరాల జలాశయం 17 గేట్లెత్తి నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు ఇన్​ఫ్లో 92 వేలు, ఔట్​ ఫ్లో 1.71 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 317.170 మీటర్లుగా ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.042 టీఎంసీలుగా ఉంది.

నిజాంసాగర్​ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు : భారీ వర్షాలకు నిజాంసాగర్​ ప్రాజెక్టులోకి 385 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. నిజాంసాగర్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు ఉండగా ప్రస్తుతం 1387 అడుగులకు నీటిమట్టం చేరింది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3 టీఎంసీలు నీటి నిల్వ ఉంది.

హుస్సేన్​ సాగర్​కు జలకళ : హైదరాబాద్​లోని హుస్సేన్​సాగర్​కి వరద నీరు పోటెత్తడంతో​ నిండుకుండలా మారింది. సాగర్​ పూర్తిస్థాయి నీటిమట్టం 514 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 513.1 అడుగులుగా ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్​ఎంసీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సాగర్​లోకి చేరుతున్న వరద నీటిని దిగువకు వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు 1.14 లక్షల క్యూసెక్కుల వరద : శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద పెరుగుతోంది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1.14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 822.5 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 42.73 టీఎంసీలుగా ఉంది.

కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 690 అడుగులు పైనే : నిర్మల్​ జిల్లాలోని కడెం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 690.60 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులుగా ఉంది. మూడు గేట్లు ఎత్తి 14,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిజామాబాద్​ జిల్లాలోని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1067 అడుగులుగా ఉంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం రాత్రి 9 గంటల వరకు 44 అడుగులకు చేరుకుంది. అలాగే

43 అడుగులను దాటి ప్రవహిస్తోన్న గోదావరి - భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ - Godavari Water Level today

తెలంగాణలో రికాం లేని వానలు - పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు - Heavy Rains Across Telangana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.