ETV Bharat / state

రుణమాఫీ 46 శాతమే జరిగింది : హరీశ్​రావు - Harish Rao On CM Revanth - HARISH RAO ON CM REVANTH

Harish Rao On CM Revanth : రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, సీఎం వ్యవహారశైలి ప్రజలు గమనిస్తున్నారన్నారు. రుణమాఫీ పాక్షికంగా చేశారంటే సరే కానీ మొత్తం చేశామంటే మాత్రం అంగీకరించేది లేదన్నారు. రుణమాఫీకి సంబంధించి పూర్తి వివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్​రావు డిమాండ్ చేశారు.

Harish Rao On CM Revanth
Harish Rao On CM Revanth (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 17, 2024, 2:10 PM IST

Updated : Aug 17, 2024, 5:37 PM IST

Harish Rao On CM Revanth : రుణమాఫీ సంపూర్ణంగా అయిందో లేదో రాష్ట్రంలోని ఏ ఊరికైనా పోయి నేరుగా రైతుల్నే అడుగుదామని మాజీమంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, సీఎం వ్యవహారశైలి ప్రజలు గమనిస్తున్నారని దొంగతనం చేసిన వారే దొంగ దొంగ అన్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. రుణమాఫీ పాక్షికంగా చేశామని, తప్పు అయిందని క్షమాపణ అడగాలి లేదా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయనన్నారు.

రుణమాఫీ 46 శాతం మాత్రమే జరిగిందని, ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందన్న హరీశ్​రావు, రుణమాఫీ కాలేదని తెలంగాణ భవన్ కు ఇప్పటి వరకు లక్షా 16వేల ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. రుణమాఫీ, ఆరు గ్యారంటీలు సంపూర్ణంగా చేస్తే రాజీనామా చేస్తానని తాను స్పష్టంగా చెప్పానని గ్యారంటీల సంగతి ఏమో కానీ, రుణమాఫీ కూడా మొత్తం చేయలేదని మాజీమంత్రి ఆక్షేపించారు.

రేవంత్ రెడ్డి చరిత్ర, తన చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలుసని కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట తప్పింది ఎవరని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేసిన చరిత్ర తనదైతే, తెలంగాణ ప్రజల పైకి రైఫిల్ పట్టుకొని పోయిన చరిత్ర రేవంత్ రెడ్డిదని వివరించారు. రుణమాఫీ కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ కన్నీరు కారుస్తున్నారని, రైతులు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

రుణమాఫీపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన హరీశ్​ రావు రైతులు, డబ్బు సహా వివరాలు ప్రకటించాలని అన్నారు. 'రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్లాఫ్ తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాప్' అని అభివర్ణించారు. రాష్ట్రంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవ దేవుళ్లు అందరిపైనా రేవంత్ రెడ్డి ఒట్లు వేశారని గుర్తు చేశారు. పాలకులు పాపం చేస్తే రాష్ట్రానికి ఎక్కడ నష్టం జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్నారని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి పాపం తగలవద్దని తానే దేవుళ్ల వద్దకు వెళ్తానన్న హరీశ్​ రావు ఈ పాపాత్ముడు చేసిన తప్పునకు రాష్ట్రం, ప్రజలను శిక్షించవద్దని వేడుకుంటానని తెలిపారు. పాపాత్ముడిని క్షమించి రాష్ట్రానికి హాని చేయవద్దని భగవంతుణ్ణి వేడుకుంటానని అన్నారు. రుణమాఫీ చేయలేదని అర్థమై ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతలు చావాలని కోరుకుంటున్నారని రేపు భౌతిక దాడులకు కూడా పాల్పడతారేమో అయినా భయపడేది లేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గాడ్ ఫాదర్లకే భయపడలేదన్న ఆయన అందరికీ రుణమాఫీ అయ్యే వరకు వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు.

"పంద్రాగస్టు రోజు ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలో మాట్లాడుతూ రుణమాఫీ అయిపోయిందని ప్రకటించారు. సరే నిజంగానే చేశారేమో అని లెక్కలు చూశాం. ఆయన చేసింది రూ.17వేల కోట్లతో 22లక్షల మంది రైతులకు మాత్రమే చేశారు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. పంద్రాగస్టులోపు రుణమాఫీని సంపూర్ణంగా చేయాలని ఆరు గ్యారంటీల్లో ఉన్న 13 హామీలు అమలు చేయండి నేను నా పదవికి రాజీనామా చేస్తానని చెప్పాను. కానీ అవన్నీ అమలు కాలేదు"- హరీశ్​రావు, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే

అప్పుడేమో ఏకకాలంలో రుణమాఫీ అంటిరి - ఇప్పుడేమో రైతులపై వడ్డీ భారం మోపుతుంటిరి : హరీశ్​రావు - Harish Rao on Farmers Loan Waiver

రేషన్‌కార్డులు ఉన్నవారికే రుణమాఫీ చేయడం సరికాదు - షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి: హరీశ్ రావు - Farmer Loan Waiver

Last Updated : Aug 17, 2024, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.