Guru Purnima Celebrations in Telangana : హైదరాబాద్ కూకట్‌పల్లిలోని భాగ్యనగర్ కాలనీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలకు మంత్రి సీతక్క హాజరయ్యారు. సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీతక్క ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. గురుపౌర్ణమి పురస్కరించుకుని హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. నల్గొండ జిల్లా చిట్యాల, నార్కట్‌పల్లి సాయిబాబ, వేణుగోపాల స్వామి ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకులు ఘనంగా జరిగాయి. ముషంపల్లి, రామగిరిలోని సాయిబాబా ఆలయాలు సాయినామస్మరణతో మారుమోగాయి.
ఆషాఢ శుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. గురుపూర్ణిమ సందర్భంగా ఆలయానికి పోటెత్తిన భక్తులు గోదావరిలో స్నానం ఆచరించి నది తీరాన ఉన్న బాబా ఆలయంలో సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర ఆలయంలో నేటితో గురుపౌర్ణమి ఉత్సవాలు ముగిసాయి. అమ్మవారిని దర్శించుకున్న ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వ్యాస మహర్షులకు విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతితో ఉత్సవ ముగింపు పలికారు.+
గురుపౌర్ణమి పేరు ఎలా వచ్చిందో తెలుసా! ఆ రోజు ఏం చేయాలి? - GURU POURNAMI 2024 SPECIAL
చిన్నారులు నృత్య ప్రదర్శనలు : గురుపౌర్ణమి సందర్భంగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట సాయినాథుని క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే ఆలాయనికి పోటెత్తిన భక్తులు స్వామివారికి ప్రత్యే పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అబిడ్స్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ సమావేశ మందిరంలో గురుపూజా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
సిద్దిపేట జిల్లా మోతే గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా మధిరలో వేడుకలు ఘనంగా జరిగాయి. సాయినాథుడిని దర్శించుకునేందుకు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు.
తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ - వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు - TG GURU PURNIMA CELEBRATIONS 2024
గురుపౌర్ణమి ఎలా జరుపుకోవాలి? గురువుకు పసుపు రంగుకు ఏంటి సంబంధం? - Guru Purnima 2024