Gun Miss Fire Incident in Oldcity : గన్ మిస్‌ఫైర్ అయ్యి ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన పాతబస్తీ హుస్సేనీఆలం పరిధిలో జరిగింది. ప్రమాదవశాత్తు గన్ మిస్‌ఫైర్ అవ్వడం వల్లే ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Gun Misfire at Hussaini Alam PS : హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలోని కబూతర్‌ఖానా వద్ద బాలేశ్వర్ అనే వ్యక్తి 1995లో టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్‌గా ఎంపికై విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో గడిపెట్టి ఉన్న గదిలో ఉంచిన గన్ రెండ్లు రౌండ్ల మిస్‌ఫైర్ అయినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బాలేశ్వర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి (Osmania Hospital) తరలించారు. కానిస్టేబుల్ బాలేశ్వర్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గన్ మిస్ ఫైర్ అవ్వడం వల్ల చనిపోయారా? లేదా ఆత్మహత్య చేసుకున్నారా అనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. బాలేశ్వర్ స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా అని అతని బంధువులు తెలిపారు. బాలేశ్వర్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాలేశ్వర్ ఆత్మహత్య చేసుకుని ఉండరని, మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు కూడా లేవని కుటుంబసభ్యులు తెలిపారు.
Gun Miss Fire Incident AT Siddipet : గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. కొన్నాళ్ల క్రితం సిద్దిపేట పట్టణ శివారులో ఉన్న ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో తుపాకీ శుభ్రపరుస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన సుతారి రాజశేఖర్ అనే వ్యక్తి 2013 బ్యాచ్ హెడ్ కానిస్టేబుల్‌గా హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
అయితే కొన్నాళ్ల క్రితం నంగునూరు మండలం రాజగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మాబులేషన్ నిర్వహించారు. అక్కడ ఉపయోగించిన ఆయుధాలను రాజశేఖర్ శుభ్రం చేశారు. ఆ క్రమంలో ఏకే - 47 గన్‌లో ఉండే చీప్ కదలడంతో బుల్లెట్ ఒకసారిగా వెలుపలికి వచ్చి అతని భుజానికి బలంగా తాకి కూడి కన్ను మీదుగా బయటకు వెళ్లింది. గమనించిన తోటి పోలీసులు అతన్ని వెంటనే సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా ప్రాథమిక చికిత్స చేశారు. అక్కడి నుంచి వైద్యుల సూచనల మేరకు హైదరాబాదులోని సరోజిని కంటి ఆస్పత్రికి తరలించారు.
Gun Misfire in Hyderabad : తుపాకీ శుభ్రం చేస్తుండగా మిస్‌ఫైర్.. కానిస్టేబుల్ మృతి
శుభ్రం చేస్తుండగా గన్ 'మిస్‌ఫైర్'.. కానిస్టేబుల్ కంటికి గాయం