ETV Bharat / state

నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ల హామీ కోసం అన్ని సభల్లో నిలదీస్తాం : కేటీఆర్​ - Job Aspirants Meet KTR in Hyderabad

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 27, 2024, 7:50 PM IST

Group 1 Aspirants Meets KTR : నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ల హామీ కోసం అన్ని సభల్లో నిలదీస్తామని బీఆర్​ఎస్​ నేత కేటీఆర్​ తెలిపారు. అలాగే అభ్యర్థులు ఎమ్మెల్యేలు అందరినీ నిలదీయాలని కోరారు. హైదరాబాద్​లోని తన నివాసంలో పోటీ పరీక్షల అభ్యర్థులతో సమావేశమయ్యారు.

Group 1 Aspirants Meets KTR
Group 1 Aspirants Meets KTR (ETV Bharat)

Job Aspirants Meets KTR in Hyderabad : 'నాడు జాబ్​ క్యాలెండర్​ పేరిట పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నీటి మూటలుగా తేల్చారు. మెగా డీఎస్సీ అన్నారు దగా చేశారు. గ్రూప్​ 2, గ్రూప్​ 3 కేటగిరీల్లో పోస్టులు పెంచి తీరాల్సిందే, వదిలిపెట్టము. ఇందుకోసం అన్ని సభల్లో నిలదీస్తామని' బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. హైదరాబాద్​లోని తన నివాసంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు కేటీఆర్​ను కలిశారు. ఆయనకు వారి ఇబ్బందులు చెబుతూ తమకు అండగా నిలవాలని కోరారు.

ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్​ ఇచ్చిన గ్రూప్​ 1, డీఎస్సీ నోటిఫికేషన్లకు కొన్ని పోస్టులు మాత్రమే పెంచారన్నారు. ఇప్పుడు గ్రూప్​ 2, గ్రూప్​ 3 కేటగిరీల్లో పోస్టులు పెంచి తీరాల్సిందే వదిలిపెట్టబోమని అన్ని సభల్లో నిలదీస్తామని చెప్పారు. అయితే పోటీ పరీక్షల అభ్యర్థులు మాత్రం ఎమ్మెల్యేలు అందరినీ కలిసి ఒత్తిడి తేవాలని సూచించారు. డిప్యూటీ సీఎం గతంలో హామీ ఇచ్చినట్లుగా గ్రూప్​ 1 మెయిన్స్​కు 1:100 నిష్పత్తిలో పిలవాలన్నారు.

అన్ని పరీక్షలు వరుసగా ఉన్నాయని, విరామం ఎక్కువగా ఉండేలా చూడాలని అభ్యర్థులు కోరుతున్నారని కేటీఆర్​ తెలిపారు. ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్​ చేశారు. లేదంటే మేమంతా రోడ్డు ఎక్కి, ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామన్నారు. మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగులే మీ సంగతి తెలుస్తారని హెచ్చరించారు.

అంతకు ముందు గ్రూప్స్​, డీఎస్సీ సహా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సోదరులు వచ్చి అండగా నిలబడాలని కేటీఆర్​ను కోరారు. కేసీఆర్​ ప్రభుత్వంపై కూడా పోరాటం చేశామని వారు చెప్పారు. హామీలు అమలు చేయడం లేని కాంగ్రెస్​పై కూడా పోరాడుతున్నామని పేర్కొన్నారు. ఇందుకు బీఆర్​ఎస్​ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అండగా ఉండాలని కోరారు.

ఈ ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో దగా చేసింది : 'గతంలో ఇచ్చి ఇప్పుడు మా డిమాండ్లపై ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. మెగా డీఎస్సీ అన్నారు దగా చేశారు. నాడు 90 లక్షల మంది ప్రయోజనాలు అన్న సీఎం రేవంత్​ రెడ్డి ఇప్పుడు వారి గురించి ఆలోచించరా?. ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు. మా డిమాండ్ల సాధన కోసం అన్ని సంఘాలు, పార్టీలను కలుస్తాం. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని' అభ్యర్థులు అన్నారు.

'గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేం' - అప్పీలును తిరస్కరించిన హైకోర్టు - HC Dismissed Single Judge Appeal to Group 1

అభ్యర్థులకు అలర్ట్ - డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేది అప్పుడే! - AP DSC NOTIFICATION 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.