Group1 Main Exam Time Table Change : హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా సమయాల్లో మార్పు చోటుచేసుకుంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగాల్సిన ఈ పరీక్ష సమాయంలో టీజీపీఎస్సీ మార్పు చేసింది. గతంలో నిర్ణయించిన సమయం కన్నా అరగంట ముందుగానే నిర్వహించనుంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిర్ణీత తేదీల్లో మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా ఆ సమయాన్ని మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు మార్పు చేసింది.
Group1 Main EXAMS : రాష్ట్రంలో 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి జూన్ 9న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఇటీవల విడుదల చేసిన టీజీపీఎస్సీ మెయిన్స్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్-1 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4.03 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, ప్రిలిమ్స్ పరీక్షకు 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, గత నెలలో విడుదలైన ప్రిలిమ్స్ ఫలితాల్లో 31 వేల మందికి పైగా అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ఈ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహిస్తారు.
జాబ్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల గురించి జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు జరుగుతాయి. గ్రూప్-1 పరీక్షలను అక్టోబర్‌లో నిర్వహిస్తామని, గ్రూప్-2 పరీక్షలను డిసెంబర్‌లో, గ్రూప్-3 పరీక్షలు నవంబర్‌లో నిర్వహిస్తామన్నారు.
కాగా ఈ ఖాళీలకు ఇప్పటికే నోటిపికేషన్లు విడుదలై పరీక్షలు మాత్రమే నిర్వహించాల్సి ఉంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి మెయిన్స్‌కు అర్హత పొందిన వారి జాబితాను ఇప్పటికే విడుదల చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లోనే మరోసారి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చి 2025 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌లో తెలిపింది. గ్రూప్-1 మెయిన్స్‌ను 2025 జులైలో నిర్వహిస్తామని పేర్కొంది.
గుడ్‌న్యూస్ - గ్రూప్-1 మెయిన్స్‌కు ఫ్రీ కోచింగ్ - దరఖాస్తు విధానమిదే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - ఆ పోస్టులన్నీ ఇకపై గ్రూప్-3లోకి - Telangana Job Notification Reforms