ETV Bharat / state

గ్రూప్‌-1 మెయిన్స్​కు దగ్గరపడుతోన్న సమయం - పరీక్షల రద్దుకు అభ్యర్థుల ఆందోళన - GROUP1 ASPIRANTS MEETS KTR

గ్రూప్‌-1పై ఉన్న కేసులన్నీ తొలిగిన తర్వాతే మెయిన్స్ జరపాలని అభ్యర్థుల డిమాండ్‌ - తెలంగాణ భవన్​లో కేటీఆర్​ను కలిసిన అభ్యర్థులు - న్యాయపరంగా సాయం అందిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారని అభ్యర్థుల వెల్లడి

Group1 Aspirants Meets Ex Minister KTR
Group1 Aspirants Meets Ex Minister KTR (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 17, 2024, 10:22 PM IST

Updated : Oct 17, 2024, 10:29 PM IST

Group-1 Candidates Protest : గ్రూప్-1 పరీక్షలు రద్దుచేయాలంటూ అభ్యర్థులు ఇవాళ కూడా ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ గాంధీనగర్‌లోని పార్కుకు పెద్దఎత్తున తరలివచ్చిన అభ్యర్థులు ఈనెల 23నుంచి నిర్వహించే పరీక్షలు రద్దు చేయాలని కోరారు. జీవో నెంబర్ 29 రద్దుచేసి పాత పద్ధతిలోనే జీఓ నెంబర్ 55ను యధావిధిగా కొనసాగించాలని నినదించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన అభ్యర్థులను పోలీసులు అరెస్ట్‌ చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకి తరలించారు. గ్రూప్‌-1పై ఉన్న కేసులన్నీ తొలగిన తర్వాతే మెయిన్స్ పరీక్ష నిర్వహించకపోతే తాము తీవ్రఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థులు అన్నారు. మరికొందరు అభ్యర్థులు రాత్రి 9 గంటల సమయంలో అశోక్​నగర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు.

Group1 Aspirants Meets Ex Minister KTR : మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న అభ్యర్థులు ఇవాళ ఉదయం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్​ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​ను కలిశారు. సమస్యలు వివరించిన అభ్యర్థులు మద్దతివ్వాలని కోరారు. కేసులు పరిష్కారం కాకుండా మెయిన్స్ నిర్వహిస్తే కొత్త చిక్కులు వస్తాయన్న అభ్యర్థులు వాటిని ప్రభుత్వం పట్టించుకోకుండా మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాకపోతే వేటిని చదవాలని ప్రశ్నించారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కేటీఆర్‌ను కోరగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు. న్యాయపరంగా సాయం అందిస్తామని చెప్పారన్న అభ్యర్థులు అవసరమైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలని పునరాలోచన చేయాలని గ్రూప్‌-1 అభ్యర్థులు కోరారు.

కాంగ్రెస్​ ప్రభుత్వ విధానాలతో అంతా ఇబ్బంది పడుతున్నారు : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లోపభూయిష్ట విధానాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్​ విద్యార్థి విభాగం ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్​ విద్యార్థులు పరీక్షలు రాస్తామో, రాయలేమోనన్న బాధలో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలతో రైతులు, యువకులతో పాటు అంతా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరికి కష్టం వచ్చినా తెలంగాణ భవన్‌ను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే అన్ని వర్గాల ప్రజలు ప్రతిపక్షం వద్దకు వస్తున్నారని పేర్కొన్నారు. గెలిస్తే ఇస్తామంటూ నమ్మబలికిన వారి హామీలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్​ విద్యార్థి విభాగం మీద ఉందని కేటీఆర్​ చెప్పారు.

అశోక్ నగర్​లో పరిస్థితి ఆందోళనకరం - మళ్లీ రోడ్డెక్కిన గ్రూప్-1 అభ్యర్థులు

గ్రూప్1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్‌ హాల్ టికెట్లు విడుదల

Last Updated : Oct 17, 2024, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.