Govt Extended the Date of Pending Traffic challans : ఇతరత్రా కారణాలవల్ల మీరు పెండింగ్ చలాన్లు చెల్లించలేకపోయారా? గడువు తేదీ నేటితో ముగియనుందని బాధపడుతున్నారా? అటువంటి వారికి రాష్ట్రప్రభుత్వం శుభవార్త అందించింది. వాహనాల పెండింగ్ చలాన్ల రాయితీ గడువు నేటితో ముగుస్తుండగా , ఫిబ్రవరి 15 వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఫైన్లైనా కడతాం కానీ రూల్స్ పాటించం - గంటకు 1,731 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.57 కోట్ల పెండింగ్ చలాన్లకు గాను 140 కోట్ల రూపాయలు వాహనదారులు చెల్లించారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో 44 లక్షల పెండింగ్ చలాన్లకు ఇప్పటికీ 34 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయి. సైబరాబాద్‌లో 25 లక్షల వాహనాల చలాన్లకు 29 కోట్ల రూపాయలు, రాచకొండలో 20 లక్షల పెండింగ్ చలాన్లకు 16 కోట్ల రూపాయలు చెల్లింపులు ఇప్పటి వరకు జరిగాయి.
గతేడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపింది. 15 రోజులు అవకాశం కల్పించిన ప్రభుత్వం సర్వర్ సమస్య సహా చలాన్లు చెల్లించేందుకు వాహనదారులు ఉత్సాహం చూపడంతో, జనవరి 31వ తేదీ వరకు గడువు పొడిగించింది. నేటితో గడువు ముగియనుండగా మరోసారి చెల్లింపు తేదీని ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
Traffic Pending Challan: మూడు రోజుల్లో రూ.39 కోట్లు.. పెండింగ్ చలాన్లకు భారీ స్పందన
Telangana Traffic Challan Discount : రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్(Traffic rules) ఉల్లంఘించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు ఎంత చెబుతున్నా వాహనదారులు మాత్రం ఆ మాటలను పెడచెవిన పెట్టేస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు సైతం ఎక్కువైపోతున్నాయి. రాంగ్ రూట్‌లో వెళ్లడం, లైసెన్స్, హెల్మెట్ లేకుండా నడపడం, మద్యం తాగి వాహనాలు (Drunk And Drive) డ్రైవ్ చేయడం తదితర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.
పోలీస్ శాఖ ప్రకటించిన డిస్కౌంట్‌ల వివరాలు :
- ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి 90 శాతం రాయితీ
- ద్విచక్రవాహనాల చలాన్లపై 80 శాతం డిస్కౌంట్
- ఫోర్ వీలర్స్, ఆటోల చలాన్లపై 60 శాతం రాయితీ
- లారీలు, ఇతర భారీ వాహనాల చలాన్లపై 50 శాతం డిస్కౌంట్
గతంలోనే ఒకసారి పెండింగ్ చలాన్ల రాయితీ గడువు ముగియడంతో ప్రభుత్వం పొడిగించింది. పొడిగించిన గడువు నేటితో తీరిపోనుంది. ఈ మేరకు మరోసారి గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Hyderabad Traffic Challan: పెండింగ్ చలాన్ల చెల్లింపునకు విశేష స్పందన.. మొరాయించిన సర్వర్