ETV Bharat / state

గవర్నర్​ కోటా ఎమ్మెల్సీల కేసు విచారణ ఈ నెల 14కి వాయిదా - Judgement on Governor Quota MLCs

Governor Quota MLC Case Postponed : గవర్నర్​ కోటా కింద ఎమ్మెల్సీ నియామకాలపై చేపట్టిన విచారణను హైకోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది. గత ప్రభుత్వ ఎమ్మెల్సీ నామినేషన్లను గవర్నర్​ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాసోజు శ్రవణ్​ కుమార్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం ఇవాళ విచారించింది.

Governor Quota MLC Case in High Court
గవర్నర్​ కోటా ఎమ్మెల్సీల కేసు విచారణ ఈ నెల 14కి వాయిదా
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2024, 9:54 PM IST

Governor Quota MLC Case Postponed : గవర్నర్​ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియామకం కావడానికి అన్ని అర్హతలు ప్రొఫెసర్ కోదండరాం, ఆమిర్ అలీఖాన్​కు ఉన్నాయని వాళ్ల తరపు న్యాయవాది అవినాష్ దేశాయ్ హైకోర్టుకు తెలిపారు. మంత్రి మండలి సిఫార్సుల మేరకే రాష్ట్ర గవర్నర్​ ఇద్దరినీ ఎమ్మెల్సీలుగా నియమించారన్నారు. గవర్నర్​ కోటా కింద ఎమ్మెల్సీ నామినేషన్లను గవర్నర్​ తమిళిసై తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్ కుమార్​లతో కూడిన ధర్మాసనం విచారణను కొనసాగించింది.

ప్రతివాదులైన కోదండరాం, ఆమిర్ అలీఖాన్ తరపు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలను కొనసాగిస్తూ తమను ఎమ్మెల్సీలుగా నియమించండని కోరే హక్కు వ్యక్తిగతంగా ఎవరికీ ఉండదని ధర్మాసనానికి తెలిపారు. గవర్నర్‌ మంత్రి మండలి సిఫార్సులకు కట్టుబడి ఉండాల్సిందేనని, అయితే మంత్రి మండలి చేసే సిఫార్సులను పరిశీలించే విచక్షణాధికారం గవర్నర్​కు ఉందని అన్నారు. దీనికి సంబంధించి పలు కోర్టు తీర్పులను అవినాష్ దేశాయ్‌ ప్రస్తావించారు.

Governor Quota MLC Case in High Court : గత మంత్రి మండలి సిఫార్సులను గవర్నర్​ సెప్టెంబరులో తిరస్కరించారని అనంతరం డిసెంబరులో తమ నియామక ప్రక్రియ ప్రారంభమై జనవరిలో పూర్తయిందని న్యాయవాది అవినాష్ దేశాయ్ ధర్మాసనానికి తెలిపారు. సెప్టెంబరులో గవర్నర్​ తిరస్కరించిన మంత్రి మండలి సిఫార్సులను తరువాత వాటిని తిరిగి గవర్నర్​కు పంపి ఉండవచ్చని కానీ ఇక్కడ అలా జరగలేదన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ గవర్నర్​ పునః పరిశీలన చేయాలని చెప్పలేదని, తిరస్కరించినట్లు పేర్కొన్నారని, పునఃపరిశీలన, తిరస్కరణ వేర్వేరు అంటూ వ్యాఖ్యానించింది.

గవర్నర్​ తిరస్కరించినపుడు తిరిగి మంత్రి మండలి సిఫార్సు చేసి ఉండాల్సిందని కోదండరాం, అలీఖాన్​ తరఫు న్యాయవాది అవినాష్ దేశాయ్ అన్నారు. మంత్రి మండలి, గవర్నర్​ కంటే రాజ్యాంగం అత్యున్నతమని తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్​ విచక్షణాధికారం న్యాయ సమీక్షలకు సంబంధించి సుప్రీం కోర్టుతో పాటు పలు హైకోర్టులు వెలువరించిన తీర్పులను ప్రస్తావిస్తూ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. ఈ వాదనలకు సమాధానం చెప్పడానికి పిటీషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంది గడువు కోరడంతో ధర్మాసనం విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది.

Telangana High Court Judgement on Governor Quota MLCs : ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం జనవరి 27న జీవో 12ను జారీ చేసింది. ఈ జీవో 12ను సవాలు చేస్తూ పిటిషనర్లు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీంతోపాటు కొత్తగా ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, ఆమీర్ అలీఖాన్‌ను ప్రతివాదులుగా చేర్చాలని కోరుతూ మరో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే(Justice Alok Aarade), జస్టిస్ జె.అనిల్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టిన విషయం విదితమే.

'మంత్రిమండలి పంపిన సిఫార్సులన్నీ యథాతథంగా ఆమోదించడానికి గవర్నర్​ ఏమీ రబ్బరు స్టాంపు కాదు'

సాగునీటి ప్రాజెక్టులపై తీర్మానానికి ఆమోదం - శాసనసభ రేపటికి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.