ETV Bharat / state

బాసర ఆర్జీకేయూటీకీ గవర్నరే ఛాన్స్‌లర్ - వర్సిటీ చట్టంలో సవరణకు సర్కార్ సన్నాహాలు! - Governor as Chancellor Basara RGUKT

Governor as Chancellor Basara RGUKT : బాసర ఆర్జీయూకేటీకి గవర్నర్​నే ఛాన్స్‌లర్‌గా నియమించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం యూనివర్సిటీల చట్టంలో సవరణకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. అలాగే ఉపకులపతి పదవీకాలాన్ని మూడు సంవత్సరాలకు కుదించాలనే ఆలోచనతో ఉంది.

Basara RGUKT
Basara RGUKT
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 9:53 AM IST

Governor as Chancellor Basara RGUKT : బాసరలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక, వైజ్ఞానిక విశ్వవిద్యాలయానికి మిగిలిన యూనివర్సిటీల మాదిరిగా గవర్నర్‌నే కులపతిగా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు విశ్వవిద్యాలయ చట్టంలో సవరణ చేయాలని యోచిస్తోంది. ఇటీవల తెలంగాణలోని 10 విశ్వ విద్యాలయాలకు మాత్రమే ఉప కులపతుల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసిన సర్కార్, ఆర్జీయూకేటీని పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ వర్సిటీకి కూడా శాశ్వత ఛాన్స్‌లర్‌ను నియమించాలన్న లక్ష్యంతో విద్యాశాఖ వర్సిటీ చట్టాన్ని పరిశీలిస్తోంది.

Basara IIIT Vice Chancellor Tenure : ప్రస్తుత వర్సిటీ చట్ట ప్రకారం వైస్ ఛాన్స్‌లర్ (Vice Chancellor) పదవీ కాలం ఐదేళ్లు ఉండగా, మిగిలిన వర్సిటీల మాదిరిగా మూడేళ్లు చేయాలన్న ఆలోచనలో ఉన్న రాష్ట్ర సర్కార్ ఆ దిశగా సమాయత్తమవుతోంది. వీలైతే ఈ నెలలో జరిగే బడ్జెట్‌ సమావేశాల్లో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టి త్వరగా శాశ్వత కులపతి నియామకానికి నోటిఫికేషన్‌ ఇవ్వాలని భావిస్తున్నారు.

ఆన్‌లైన్‌ కోర్సులకు వర్చువల్​ విశ్వవిద్యాలయాలు!

2015 నుంచి ఇంఛార్జ్ వీసీలే : బాసర ఆర్జీకేయూటీకి (Basara RGUKT) 2010 ఫిబ్రవరి నుంచి 2015 ఫిబ్రవరి వరకు ఐదేళ్ల పాటు ఐఐటీ ఖరగ్‌పుర్‌కు చెందిన ఆచార్య ఆర్‌వీ రాజకుమార్‌ వీసీగా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి శాశ్వత ఉపకులపతి లేరు. రాజకుమార్‌ పదవీ కాలం అనంతరం రెండేళ్ల పాటు ఓయూ మాజీ వైస్ ఛాన్స్‌లర్ సత్యనారాయణ, 2017 నుంచి 2020 వరకు అప్పటి ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌, ఆ తర్వాత రాహుల్‌ బొజ్జా ఇంఛార్జ్ వీసీలుగా వ్యవహరించారు. అంటే దాదాపు ఐదేళ్ల పాటు ఐఏఎస్‌ అధికారులే ఇంఛార్జ్ ఉపకులపతులుగా ఉన్నారు.

2022 మే నెలలో విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన మేరకు గత సర్కార్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య వి.వెంకటరమణను ఇంఛార్జ్ వైస్ ఛాన్స్‌లర్‌గా నియమించింది. అప్పటి నుంచి ఆయనే కొనసాగుతున్నారు. దేశంలో తొమ్మిది సంవత్సరాల పాటు శాశ్వత వీసీ లేని ఏకైక యూనివర్సిటీ ఇదేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

దేశంలో ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్.. టాప్​ కాలేజీల లిస్ట్​ ఇదే

కొత్త చట్టం చేస్తేనే శాశ్వత ఛాన్స్‌లర్‌ : రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు గవర్నర్‌ ఛాన్స్‌లర్‌గా ఉంటారు. ఆర్జీకేయూటీకి మాత్రం ప్రత్యేక చట్టముంది. ఆ చట్టం ప్రకారం పాలక మండలి(గవర్నింగ్‌ బాడీ) ఓ విద్యావేత్తను కులపతిగా నియమిస్తుంది. ఆ కులపతి వీసీని నియమిస్తారు. అమెరికాకు చెందిన కార్నెగి మెలన్‌ వర్సిటీ కంప్యూటర్‌ సైన్స్‌ ఆచార్యుడు రాజిరెడ్డి 2015 ఫిబ్రవరి వరకు ఆర్జీకేయూటీ ఛాన్స్‌లర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత శాశ్వత కులపతి లేరు. తెలంగాణ ప్రభుత్వ నిధులతో నడుస్తున్నందున మిగిలిన యూనివర్సిటీల మాదిరిగానే గవర్నరే ఛాన్స్‌లర్‌గా ఉంటే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. యూజీసీ మార్గదర్శకాలను సవరించి కొత్త చట్టం చేస్తేనే శాశ్వత కులపతిని నియమించడానికి వీలవుతుంది.

విశ్వవిద్యాలయాలు విశిష్ట నిలయాలుగా ఎదగాలి: గవర్నర్‌

ఏడేళ్ల గోస.. ఏదీ ధ్యాస.. న్యాక్‌ ‘సి’ గ్రేడ్‌తో మరింత అప్రతిష్ఠ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.