Government Officials Tribute to Ramoji Rao Demise: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల పలువురు ప్రభుత్వ అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులర్పించారు. మీడియా, సినీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలుగు పాత్రికేయ రంగానికి, తెలుగు భాషాభివృద్ధికి ఆయన చేసిన సేవలు అమూల్యమైనవి అన్నారు.
AP CS Nirabh Kumar Prasad: ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు మృతిపట్ల ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసారు. తెలుగు పాత్రికేయ రంగానికి తెలుగు భాషాభివృద్ధికి ఆయన చేసిన సేవలు అమూల్యమైనవి కొనియాడారు. రామోజీ రావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీ రావు భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
Supreme Court Retired Chief Justice NV Ramana: తెలుగు ప్రజల దినచర్యలో భాగమైన రామోజీరావు అనే వ్యవస్థ ఈరోజు నిష్క్రమించిందని సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ విచారం వ్యక్తం చేశారు. ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థీవ దేహానికి ఆయన నివాళులర్పించారు. అనేక సందర్భాల్లో ప్రజా సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణకోసం అలుపెరగని పోరాటం చేసిన పోరాట యోధుడు రామోజీరావు అని కొనియాడారు.
Legislative Council Chairman Moshen Raju: రామోజీ రావు అకస్మిక మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు అన్నారు. ఈనాడు పత్రికను తెలుగువాళ్ల ఇళ్ల లోగిళ్లలో నిత్యావసర వస్తువుగా మార్చిన వ్యక్తి, తెలుగు వాళ్లు గర్వపడదగిన మనిషి రామోజీ అని కొనియాడారు అయన మృతికి సంతాపం వ్యక్తం చేసారు.
Madhya Pradesh High Court Judge: రామోజీ రావు మృతికి మద్రాస్ హై కోర్టు న్యాయమూర్త్ జస్టిస్ భట్టు దేవానంద్, మధ్యప్రదేశ్ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకట రమణలు తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు. గుడివాడ నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన మహా వ్యక్తి రామోజీ రావు అని ఆయన మరణం తెలుగు జాతికి తీరని లోటు అని అన్నారు. ఆయన మరణంతో తెలుగు మీడియా రంగం ఒక మహోన్నత వ్యక్తినీ కోల్పోయిందని అన్నారు.
ఆతిథ్యరంగ సంస్థల్లో ప్రముఖ స్థాయిలో డాల్ఫిన్ హోటళ్లు - Ramoji Dolphin Hotels