Government Focus On paddy Procurement : యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన తేదీల ప్రకారం యాసంగి సీజన్ 2023-24కు సంబంధించి ధాన్యం సేకరణ ఏప్రిల్ 1 నుంచే ప్రారంభం కావాలి. అయితే నల్గొండ, నిజామాబాద్ వంటి కొన్ని జిల్లాల్లో మార్చిలో ధాన్యం కొనుగోళ్లు(paddy Procurement) ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రైతన్నలకు నష్టం కలగకుండా ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియను ముందుస్తుగా చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం(state Government) ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను అభ్యర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈ నెల 25 నుంచి ధాన్యం సేకరణ ప్రారంభించేందుకు ఎఫ్సీఐ అనుమతించింది.
Arrangements For paddy Procurement : ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరి పంట కోతలు ఆరంభమై పంట చేతికొస్తోంది. అందువల్ల అవసరమైన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరిచి సజావుగా ధాన్యం సేకరణ ప్రక్రియ(Paddy Procurement) జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఇప్పటికే సమాచారం అందించారు. అలాగే, ఆయా కేంద్రాల్లో తాగు నీరు, తార్పాలిన్లు, లోడింగ్, అన్‌లోడింగ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రైతుల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా 7149 వరి కొనుగోలు కేంద్రాలు(centers) తెరిచేందుకు యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నట్లుగా పౌరసరఫరాల సంస్థ(Food Supply Department) వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇప్పటికే నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో 19 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని పౌర సరఫరాల సంస్థ వెల్లడించింది.
అకాల వర్షాలతో పంటలకు అపార నష్టం
ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. చేతికందొచ్చిన పంటను నాశనం చేసి నష్టం మిగిల్చింది. పెట్టిన పెట్టుబడి వర్షం పాలైంది. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కురిసిన భారీ వడగండ్ల వానతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40 వేళ ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లితే ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 20 వేల ఎకరాలకు పైగా పంటలను రైతులు కోల్పోవాల్సి వచ్చింది. వడగళ్ల, ఈదురు గాలులతో కూడిన వానలతో రైతన్నలు పూర్తిగా నష్టపోయారు. వరి, మొక్కజొన్న, మామిడి, బొప్పాయి, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
యాసంగి ధాన్యం వేలం - పౌరసరఫరాల శాఖకు గతం కంటే రూ.1100 కోట్ల లాభం
'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రెంటికి చెడిన రేవడిలా.. రైస్ మిల్లర్లు
'సాగర్ ఆయకట్టు రైతులకు నీటికష్టాలు - ఎండిన పంటలను తగలబెడుతున్న అన్నదాతలు
అపార పంట నష్టం - ఆదుకోమంటూ రైతన్నల వేడుకోలు - CROP DAMAGE in Telangana