Godavarikhani Road Expansion Works : రామగుండాన్ని వాణిజ్యపరంగా తీర్చిదిద్ది పూర్వ వైభవం తీసుకురావడానికి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అందులో భాగంగా ప్రత్యేకంగ నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి ప్రాధాన్యతగా గోదావరిఖని పట్టణంలోని లక్ష్మీ నగర్, ఉల్లిగడ్డ బజార్ ఏరియా, మేదరబస్తీ,ఓల్డ్ అశోక టాకీస్ ఏరియాలలో వ్యాపారాలను పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికిగాను వ్యాపార కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం నిధుల నుంచి రూ.50కోట్లు కేటాయించారు.
Ramagundam Development Works : మున్సిపల్ సుందరీకరణలో భాగంగా ప్రధాన చౌరస్తా నుంచి ఆర్సీఓ క్లబ్ రహదారులను విస్తరించనున్నారు. ముఖ్యంగా గోదావరిఖని మెయిన్ చౌరస్తా నుంచి వ్యాపార కేంద్రాలకు వెళ్లే రహదారులను పూర్తిస్థాయిలో విస్తరించి అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా సింగరేణి యాజమాన్యం 72 క్వార్టర్లను తొలగించాలని నిర్ణయించింది.
రామగుండం విద్యుత్ కేంద్రం ఆధునికీకరణకు డిమాండ్ - కొత్త ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదన!
సింగరేణి క్వార్టర్స్‌లో నివాసముంటున్న కార్మిక కుటుంబాలకు నోటీసులు ఇచ్చింది. అభివృద్ధి పనుల కోసం 15 రోజుల్లో క్వార్టర్ ఖాళీ చేయాలని, ప్రత్యామ్నాయంగా మరోచోట క్వార్టర్స్ కేటాయిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ ప్రదేశంలో దశాబ్దాలుగా వ్యాపారాలు చేసుకుంటున్న వారు తమకు అన్యాయం జరగకుండా చూడాలని వేడుకుంటున్నారు.
"మేము గత 20 సంవత్సరాల నుంచి మేదర బస్తీలో షాపులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాం. సింగరేణి క్వార్టర్లో షెడ్లు వేసుకుని ఉంటున్నాం. ఇక్కడ రోడ్డు విస్తరిస్తారని దాని కోసం మా షాపులు తీసివేస్తామంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉంటు జీవిస్తున్నాం. ఇవి తీసేస్తే మా బతుకులు రోడ్డు మీద పడ్తాయి. మాకు ఇక్కడ కాకపోతే మరొక చోటైనా జీవనోపాధి కల్పించాలని అధికారులను, స్థానిక నాయకులను కోరుతున్నాం." - వ్యాపారులు
Ramagundam NTPC Power generation : ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.. ఉత్పత్తి మరిచారు..!
గోదావరిఖని హనుమాన్‌నగర్, శివాజీ నగర్ బస్తీ, అశోక్‌నగర్ ప్రాంతాల్లో రోడ్డువైపు ఉన్న క్వార్టర్లకు భారీ డిమాండ్ ఉంది. ఈ క్వార్టర్లు ఆనుకొని షెడ్లు నిర్మించారు. వీటిని వ్యాపారులకు అద్దెకిచ్చారు. కొందరు కార్మికులు పదవి విరమణ చేసినా క్వార్టర్లను ఖాళీ చేయడం లేదు. క్వార్టర్లు ఖాళీ ప్రధాన రహదారులు కావడంతో వ్యాపార సదుపాయానికి నెలకు రూ.20వేల నుంచి రూ,30వేల వరకు డిమాండ్ ఉంది.
సింగరేణి నోటీస్ ఇచ్చిన 72 క్వార్టర్లలో అధికంగా ఈ తరహా నిర్మాణాలు ఉన్నాయి. సుందరీకరణలో తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిని జీవనోపాధి కోల్పోతామనే భయాందోళకు గురవుతున్నారు. వ్యాపార వాణిజ్య కార్యకలాపాలతో క్రిక్కిరిసిపోయిన ప్రాంతాన్ని అభివృద్ది చేయాలన్న పట్టుదలతో తాము ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం అక్కడ కొన్నేళ్లుగా వ్యాపారం చేసుకుంటున్నవారు సహకరిస్తే యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే అభయమిస్తున్నారు.
Greenery in Singareni Coal mines area : బొగ్గుగనుల్లో పచ్చదనం.. పర్యావరణ సమతౌల్యానికి చెట్ల పెంపకం