ETV Bharat / state

అమ్మకు యాక్సిడెంట్ అని చెప్పి బాలిక కిడ్నాప్ - కాకపోతే మధ్యలో సీన్ రివర్సైంది - GIRL ESCAPES FROM KIDNAPPERS

బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్​ చేసిన దుండగులు - కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని బయటకు వచ్చిన బాలిక

Girl escapes from kidnappers
Girl escapes from kidnappers (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 12 minutes ago

Girl escapes from Kidnappers : ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా వెంగళరావునగర్‌లో బాలిక అపహరణం కలకలం రేపింది. ఆమె తల్లికి రోడ్డు ప్రమాదం జరిగిందని మాయమాటలు చెప్పి గుర్తు తెలియని దుండగులు బాలికను కారులో తీసుకెళ్లారు. విజయవాడ మీదుగా బాలికను తీసుకెళ్లేందుకు ముఠా ప్లాన్​ వేసింది. విజయవాడ బస్టాండ్‌ సమీపంలో కారు ఆపి ముఠా సభ్యులు భోజనానికి వెళ్లారు.

ఈ క్రమంలోనే కారు డోర్‌కు లాక్‌ పడకపోవడంతో సదరు బాలిక తప్పించుకుంది. విజయవాడ బస్టాండ్‌ కంట్రోల్‌ రూమ్ సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేసింది. దీనిపై వెంటనే స్పందించి అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది కిడ్పాపర్ల నుంచి బాలికను సురక్షితంగా రక్షించారు. ఈ విషయం తెలుసుకున్న కిడ్నాపర్లు కారును అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. ఈ ఘటనపై ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు కిడ్నాపర్లు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.

ముసుగులో వచ్చి శిశువును కిడ్నాప్ చేసిన గ్యాంగ్ : కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో జరిగింది. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఓ శిశువు అపహరణకు గురైంది. బాధితులు కంప్లైంట్​ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు శిశువు కిడ్నాపైన 30 గంటల్లోనే కేసును ఛేదించి పసిబిడ్డను కాపాడగలిగారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని దుడికొండ గ్రామానికి చెందిన అబ్బాస్​ అలీ భార్య నశిమా 5 కాన్పునకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. సిజేరియన్​ ద్వారా ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే కొంత సమయానికే శిశువు అపహరణకు గురైంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు పాపను హైదరాబాద్​లో గుర్తించారు.

హైదరాబాద్​ వ్యాపారవేత్త కిడ్నాప్ కేసు - చాకచక్యంగా ఛేదించిన పోలీసులు - HYDERABAD BUSINESSMAN KIDNAP CASE

సాఫ్ట్​వేర్ ఇంజినీర్​ కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు - ఐదుగురు నిందితుల అరెస్ట్

Last Updated : 12 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.