ETV Bharat / state

జీతం పడగానే ఒక్కో కార్మికుడి నుంచి రూ.500 వసూలు - బల్దియాలో ఫీల్డ్ అసిస్టెంట్ల అరాచకాలు! - Hyderabad Labour Issues

GHMC Labour Complaint on Asking Money : జీహెచ్​ఎంసీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల నుంచి, కొందరు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న విషయం బయటపడింది. ఇవాళ పారిశుద్ధ్య కార్మికులతో జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ ఛైర్మన్ వెంకటేశన్ భేటీ అవ్వగా, ఈ సమావేశంలో కొందరు మహిళా కార్మికులు తమకు జరుగుతున్న అన్యాయాలను ఛైర్మన్​ ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా ఆరోగ్య సమస్యలతో ఈఎస్ఐ ఆస్పత్రులకు వెళ్తే పట్టించుకోవడం లేదని వాపోయారు.

GHMC Safai Karmachari Meeting
GHMC Labour Complaint on Asking Money
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 4:42 PM IST

GHMC Labour Complaint on Asking Money : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్​లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల నుంచి కొంతమంది సిబ్బంది బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు బయటపడింది. జీతం పడగానే శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు(ఎస్ఎఫ్ఏ)లు ఒక్కో కార్మికుడి నుంచి రూ.500 వసూళ్లకు పాల్పడుతున్నట్లు పలువురు మహిళా కార్మికులు(Women Workers) జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ ఛైర్మన్ వెంకటేశన్ ముందు వాపోయారు.

'హైదరాబాద్ పేరు, గుర్తింపు దెబ్బతినకుండా మరింత అప్రమత్తంగా పని చేయాలి'

ఇవాళ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ రొనాల్డ్ రోస్, అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ సమక్షంలో ఛైర్మన్ వెంకటేశన్ పారిశుద్ధ్య కార్మికులు, కార్మిక సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు, జీహెచ్ఎంసీ నుంచి అందుతున్న సదుపాయాలు, జీవిత బీమా(Life Insurance), పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

GHMC Safai Karmachari Meeting : ఈ సందర్భంగా పలువురు పారిశుద్ధ్య కార్మికులు వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. తమ జీతాల్లో నుంచి నెల నెల బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నారని, అత్యవసరం ఉండి ఒకరోజు పనికిరాకపోయినా వెయ్యి రూపాయలు కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోషామహల్(Goshamahal)​, బషీర్ బాగ్ ప్రాంతాల్లో ఈ వసూళ్లు అధికంగా ఉన్నట్లు వివరించారు.

Hyderabad Labour Issues : కొంతమంది కార్మికులకు పీఎఫ్ జమ కావడం లేదని, ఆరోగ్య సమస్యలతో ఈఎస్ఐ ఆస్పత్రులకు వెళ్తే పట్టించుకోవడం లేదని వాపోయారు. విధి నిర్వహణలో తమకు అందించే పారిశుద్ధ్య కిట్లు పక్కదారి పడుతున్నాయని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను విన్న ఛైర్మన్ వెంకటేశన్, కమిషనర్ రొనాల్డ్ రోస్(Commissioner Ronald Rose), అక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవడంతో పాటు సమస్యల్లో ఉన్న వారిని అధికారులు పట్టించుకోవాలని ఆదేశించారు. కార్మికుల ఉద్యోగ భద్రత, వేతనాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు.

రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్​ హైదరాబాద్​ అభివృద్ధిని అడ్డుకుంటోంది : కేటీఆర్​

Swachh Award for Sanitation Work : హైదరాబాద్​ మహా నగరంలో చేపట్టిన ఇంటింటి చెత్త సేకరణ, చెత్త కుప్పలు లేకుండా చూడటం వంటి విభాగాల్లో ఓ మోస్తరు మార్కులు లభించాయి. ముఖ్యంగా శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ల అవినీతి, దౌర్జన్యం పుణ్యమా చెత్త సేకరణ, పారిశుద్ధ్యం ఆశించినంతగా సాగడం లేదని ఉన్నతాధికారులు గుర్తించారు.

జీహెచ్​ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలికి అనూహ్య గౌరవం - గణతంత్ర వేడుకల పరేడ్​కు కేంద్రం నుంచి ఆహ్వానం

కుక్కకాటుతో ఆర్థికంగా కుదేలవుతున్న బాధితులకు దిక్కెవరు? - రేబిస్ ఫ్రీ హైదరాబాద్ లక్ష్యం ఎటుపోతోంది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.