GHMC Dog Catching Helpline Number : వీధి కుక్కలు నగరవాసులపై దాడి చేస్తోన్న ఘటనలు పెరుగుతుండటంతో నగర పాలక సంస్థ కాల్ సెంటర్ నంబర్లను ప్రకటించింది. రోజంతా కాల్ సెంటర్ పని చేస్తుందని, వీధి కుక్కల సమస్య గురించి పౌరులు 040-21111111, 040-23225397 ఫోన్ నంబర్లను సంప్రదించి సాయం పొందవచ్చని జీహెచ్‌ఎంసీ ట్వీట్ చేసింది.
ఫిర్యాదు అందిన వెంటనే డాగ్ క్యాచింగ్ సిబ్బంది వచ్చి నేరుగా వీధి శునకాలను సంరక్షణ కేంద్రాలకు తరలిస్తారు. వాటికి అక్కడ సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సతో పాటు ఒకవేళ రేబిస్ సోకి ఉంటే టీకాలు వేస్తారు. దశల వారీగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని వీధి కుక్కలన్నింటికీ 100 శాతం యాంటీ రేబీస్ టీకాలు వేయాలని కూడా అధికారులు నిర్ణయించారు. వీటితో పాటు మై జీహెచ్‌ఎంసీ (myghmc) యాప్ ద్వారా కూడా కుక్కల బెడద ఉంటే ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.
మీ ఏరియాలో కుక్కల బెడద ఉందా?
— GHMC (@GHMCOnline) July 24, 2024
టోల్ ఫ్రీ నంబర్లు 040-21111111, 040-23225397కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. మా డాగ్ క్యాచింగ్ టీంలు నేరుగా వచ్చి వీధి శునకాలను సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్ చేస్తాయి. #StreetDogsMenace #GHMC #TollFreeNumber pic.twitter.com/21VyPUv61j
ప్రభుత్వ అధికారులతో ఉన్నతస్థాయి కమిటీ : కుక్కకాటు వల్ల ఇటీవల జవహర్‌నగర్‌లో ఓ చిన్నారి చనిపోవడం, చాలా రోజులుగా ఈ తరహా దుర్ఘటనలు చోటు చేసుకోవడంపై ఇటీవల రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు సర్కారు ఎన్జీవో ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో ఉన్నతస్థాయి కమిటీ వేసి స్పెషల్ యాక్టివిటీ రూపొందిస్తున్నాయి. అందులో భాగంగా బల్దియా పలు చర్యలు తీసుకుంటోంది. కాల్ సెంటర్‌కు సమస్యను తెలియజేయగానే, దగ్గర్లోని వెహికల్స్ అక్కడికి చేరుకుని, కుక్కలను తీసుకెళ్తాయని అధికారులు తెలిపారు. వాటిని మూడు రోజులపాటు సంరక్షణ కేంద్రంలో ఉంచి, అవసరమైన శస్త్రచికిత్సలు (కుని), టీకాలు వేసి సంరక్షిస్తామన్నారు.
కుక్కల కట్టడికి - 11 లక్ష్యాలు : మరోవైపు వీధి కుక్కల సమస్య నివారణకు నగర పాలక సంస్థ 11 లక్ష్యాలను నిర్దేశించుకుని, అమలుకు శ్రీకారం చుట్టింది.
- కుక్కల ప్రవర్తన, ఎలా తప్పించుకోవాలి, జాగ్రత్తలపై కాలనీ సంఘాలు, టౌన్ లెవల్ ఫెడరేషన్లు, ఎస్‌హెచ్‌జీలతో అవగాహన కల్పించడం.
- నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద శిశువుల కేర్ సెంటర్ తప్పనిసరి.
- పెంపుడు యానిమల్ వివరాల నమోదుతో కుక్కకాటు ఘటనల నియంత్రణ.
- నీటి తొట్టెలు, ఆహారం అందించే ప్రాంతాలు, జంతు సంరక్షణ కేంద్రాలు, ఎన్జీవోలు, మాంసం వ్యర్థాలను పడేసే ప్రాంతాలు, దుకాణాలు, నమోదు కేంద్రాలను జియోట్యాగ్ చేసి డిజిటల్ మ్యాపింగ్
- దత్తత ప్రోగ్రామ్స్
- 24 గంటలూ కుక్కలను పట్టుకునే వెహికల్స్ సేవలు
- కుని శస్త్రచికిత్సలు, రేబిస్ టీకాలు వేయడం
- మూసీ నదీ పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి