Lakshmi Narasimha Swamy Laddu Ghee Pure : తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారమే చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో దేశంలోని అన్ని హిందూ దేవాలయాలు లడ్డూ, ప్రసాదాలకు వాడుతున్న నెయ్యి స్వచ్ఛతపై అప్రమత్తమయ్యాయి. ప్రసాదాలకు వాడుతున్న నెయ్యిని ల్యాబ్‌లకు పంపించి పరీక్షలు జరిపిస్తున్నారు. ఆ పరీక్షల్లో నెయ్యి స్వచ్ఛమైదేనని తేలితే, భక్తులకు తెలిసేలా ప్రకటనలు జారీ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి లడ్డూ తయారీకి వినియోగిస్తున్న నెయ్యి స్వచ్ఛమైదేనని తేలింది. ఇందుకు సంబంధించిన ప్రకటనను దేవస్థానం ఈవో భాస్కర్‌రావు తెలిపారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్న మదర్ డెయిరీ నెయ్యి నమూనాలను ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్ నాచారంలోని రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు పంపించామని ఈవో వివరించారు. అక్కడి ప్రయోగశాలలో పరీక్షలు జరిపి నెయ్యి స్వచ్ఛమైనదిగా నిర్ధారించారని వెల్లడించారు. భక్తులు ఎవరూ ఇక నుంచి లడ్డూ ప్రసాదాలను తీసుకోవడానికి సంకోచించవలసిన అవసరం లేదని, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి లడ్డూ ప్రసాదం పవిత్రమైందని తెలిపారు.
కిలో నెయ్యి రూ.609 : కల్తీ నెయ్యితో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేశారన్న వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నెయ్యి నమూనాలను పరీక్షకు పంపిందని కార్యనిర్వహణధికారి భాస్కర్‌రావు తెలిపారు. ఆ నివేదిక సైతం దేవస్థానానికి అందిందని అన్నారు. కిలో రూ.609కు కొనుగోలు చేస్తున్న నెయ్యి నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉన్నట్లు వెల్లడించారు. ప్రసాదాల తయారీకి రోజుకు 1000 కిలోల నెయ్యిని వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడాదిలో సుమారు రూ.15 కోట్ల నెయ్యిని మదర్ డెయిరీ నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రక్రియ అంతా టెండర్ విధానంలో గత 40 ఏళ్లుగా కొనసాగుతోందని ఈవో భాస్కర్‌రావు వివరించారు.
లడ్డూ తయారీకి విజయ డెయిరీ నెయ్యి : శ్రీలక్ష్మీనరసింహస్వామి లడ్డూ తయారీకి విజయ డెయిరీ నెయ్యి వాడాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాల మేరకు ఇక ముందు దేవుడి లడ్డూ ప్రసాదాల తయారీకి నెయ్యిని విజయ డెయిరీ నుంచి కొనుగోలు చేస్తామని ఈవో చెప్పారు. అయితే ప్రస్తుతం పాత టెండర్ కొనసాగుతున్నందున వచ్చే మార్చి నెలాఖరు వరకు మదర్ డెయిరీ నెయ్యినే వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు.
తిరుమల లడ్డూ వివాదం - యాదాద్రి ప్రసాదంపై అధికారుల కీలక నిర్ణయం - YADADRI LADDU QUALITY TEST IN HYD
యాదాద్రి పుణ్యక్షేత్రంలో త్వరలో డిజిటల్ పేమెంట్తోనూ లడ్డూ, ప్రసాదం