ETV Bharat / state

పాలల్లో గంజాయి - మత్తు పదార్థాల విక్రయానికి మరో మార్గం - ఉక్కుపాదం మోపిన ఉపయోగం ఆగట్లే - Ganja Powder Smuggling - GANJA POWDER SMUGGLING

Ganja Powder Mixing With Milk In Telangana : గంజాయి సేవించడంతో కిక్కు రావడంలేదని నేరగాళ్లు దాని ద్వారా హ్యాష్ ఆయిల్‌ను తయారు చేశారు. కానీ ఆ మత్తు చాలనట్టూ గంజాయితో చాక్లెట్లనూ చేసినట్లు మనం తరచూ వార్తల్లో చూస్తున్నాం. కానీ ఇప్పుడు ట్రెండు మారింది. మారిన పరిస్థితులు, పెరిగిన తనిఖీలతో స్మగ్లర్లు సరఫరాకు సరికొత్త పంథా ఎచ్చుకున్నారు. పాలల్లో కలిపి తాగడానికి వీలుగా సరికొత్త రూపంలో గంజాయి పొడిని తయారు చేసి విక్రయిస్తున్నారు.

Ganja Powder  Seller Arrested in Hyderabad
Ganja Powder Smuggling In Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 18, 2024, 2:10 PM IST

మత్తుకు సరికొత్త మార్గం - పాలల్లో కలిపి తాగడానికి వీలుగా గంజాయి పొడి

Ganja Powder Smuggling In Telangana : మత్తు పదార్థాల నియంత్రణకు ప్రభుత్వం టీఎస్‌ న్యాబ్‌ ఏర్పాటు చేసింది. దీనికి తోడు నగరంలో ఎస్‌వోటీ, టాస్క్‌ఫోర్స్‌ ప్రత్యేక విభాగాలు ఎప్పటికప్పుడు మత్తు ముఠాల ఆటకట్టిస్తున్నాయి. పోలీసులు ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా పెరిగిన డిమాండుతో స్మగ్లర్లు కొత్తదారుల్లో నగరానికి మత్తు పదార్థాలను తీసుకొస్తున్నారు. నిఘా తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో హ్యాష్‌ ఆయిల్‌గా మార్చి రంగు రంగుల నీళ్ల సీసాల్లో నింపి రైళ్లలో తీసుకురావడం, గంజాయి పిప్పితో చాక్లెట్లు తయారుచేసి తినుబండారాల రూపంలో కొరియర్‌ సర్వీసుల్లో నగరానికి పంపిస్తున్నారు.

Ganja Powder Seller Arrested in Hyderabad : ఈ క్రమంలోనే గంజాయిని పొడిగా మార్చి ఒడిశా, కోల్‌కతా రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. పొడిగా మారిస్తే తక్కువ పరిమాణంలో ఎక్కువ మందికి విక్రయించేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నారు. పోలీసుల నిఘా పెరగడంతో కొరియర్ల ద్వారా గంజాయిని పొడిగా మార్చి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీలకు చిక్కకుండా వేర్వేరు పేర్లతో విక్రయిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తాజాగా నగరంలోని జగద్గిరిగుట్టలోని ఒక కిరాణా స్టోర్‌లో సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు ఇటీవల గంజాయి పొడిని స్వాధీనం చేసుకున్నారు.

ఒడిశా నుంచి హైదరాబాద్​కు గంజాయి సరఫరా - మాటువేసి పట్టుకున్న పోలీసులు - Ganja Supplier Arrested

గంజాయి, హ్యాష్‌ ఆయిల్, చాక్లెట్ల బదులు పొడి ఎందుకు విక్రయిస్తున్నావని పోలీసులు ఆరా తీయగా పాలల్లో కలిపి తాగేందుకు విక్రయిస్తున్నట్లు దుకాణ యజమాని చెప్పడంతో పోలీసులే ఆశ్చర్యపోయారు. అతని వద్ద రూ. 2లక్షల 66వేల విలువ చేసే నాలుగు కిలోల గంజాయి పొడితో పాటు 26 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయాలు పెంచుకోవడానికి స్మగ్లర్లు చేస్తున్న ప్రయోగాలతో కళాశాలలు, పాఠశాలల వద్ద అడ్డగోలుగా విక్రయాలు జరుగుతున్నాయి.

నగర శివార్లలోని కొన్ని కిరాణా దుకాణాలు, పాన్‌డబ్బాల్లో గంజాయి చాక్లెట్లు, రాజస్థాన్‌ నుంచి తీసుకొచ్చే ఓపీఎం విక్రయాలు గుట్టుగా సాగుతున్నాయి. ఈ తరహా మత్తు పదార్థాలను ప్రారంభంలో రూ. 50 రూపాయలు అంతకంటే తక్కువ ధరకు అమ్ముతారు. ‘ఈ ఒక్కసారి చూద్దాం’అనుకునేవారు వీటిని ప్రయత్నిస్తూ మత్తుకూపంలో మునిగిపోతున్నారు. కొందరు ఖర్చుల కోసం దందాలోకి దిగుతూ కటకటాలపాలవుతున్నారు. బుధవారం సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు ఎమ్​డీఎమ్ఏ (M.D.M.A) మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరు యువకుల్ని అరెస్టు చేశారు. నిందితులు మత్తుకు అలవాటుపడి డబ్బు సరిపోక స్మగ్లర్ల అవతారం ఎత్తినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

గంజాయి సేవిస్తున్నారా? ఐతే జాగ్రత్త బ్రదర్ - ఇక నుంచి పోలీసులు ఈజీగా పట్టేస్తారు!! - DRUGS AND DRIVE TEST

రైళ్లలో భారీగా పెరుగుతున్న గంజాయి రవాణా - గుట్టుగా రాష్ట్రాలు దాటిస్తున్న స్మగ్లర్లు - Ganja Smuggling in Telangana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.