ETV Bharat / state

34 ఏళ్లుగా ఉచితంగా శిక్షణ - అందరికీ యోగా నేర్పుతున్న పెరుమాళ్ల దత్తయ్య - Free Yoga Training

Free Yoga Training in Kurnool: వారంతా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడ్డారు. ఆస్పత్రుల చుట్టూ ఏళ్ల పాటు తిరిగారు. అయినా రోగాలు తగ్గలేదు. అలాంటి వారికి దివ్యఔషధంగా ఓ గురువు దొరికారు. ఉచితంగా యోగా నేర్పించారు. ఇంకేముంది ఎప్పటి నుంచో పట్టిపీడిస్తున్న రోగాలు మటుమాయమయ్యాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం.

Free Yoga Training
Free Yoga Training (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 10:34 AM IST

Free Yoga Training in Kurnool: కర్నూలు నగరానికి చెందిన యోగా గురువు పెరుమాళ్ల దత్తయ్య గత 34 సంవత్సరాలుగా ఉచితంగా యోగా నేర్పిస్తున్నారు. కర్నూలులోని వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో శిష్యులకు యోగా నేర్పిస్తున్నారు. తన వద్దకు వచ్చిన వారికి యోగా వల్ల కలిగే ప్రయోజనాలు చెబుతూ వారితో యోగా సాధన చేయిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారు ఆరోగ్యవంతులై వయస్సుతో సంబంధం లేకుండా వారు ఆనందంగా గడుపుతున్నారు.

యోగాను పతాంజలి మహర్షి కనుగొన్నా, ప్రపంచ వ్యాప్తంగా యోగాకు మాత్రం గుర్తింపు తెచ్చింది ప్రధానమంత్రి నరేంద్రమోదీనేని యోగా గురువు పెరుమాళ్ల దత్తయ్య అంటున్నారు. యోగా చేస్తే మనస్సు, శరీరం ఉత్సాహంగా ఉంటాయని, ఎలాంటి రోగాలు దరిచేరవని అంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు ప్రతిరోజు గంట సమయం యోగా చేయాలని వారు కోరుతున్నారు.

మంచుకొండల్లో, యుద్ధనౌకలపై సైనికుల ఆసనాలు- కాశ్మీరంలో మోదీ- దేశవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం - international yoga day

"పది మందికి యోగా నేర్పించాలి అనే సంకల్పంతో ఉచితంగా సేవ చేస్తున్నాను. నేను ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోవడం లేదు. యోగా చేయడం వలన మనకి ఒత్తిడి అనేది బాగా తగ్గిపోతుంది. కండరాలకి, ఎముకలకి, మైండ్​కి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ప్రాణాయామం చేస్తే మైండ్ చాలా బాగా పనిచేస్తుంది. అదే విధంగా ఆసనాలు చేస్తే శరీర ఆకృతి బాగుటుంది. మెడిటేషన్ చేస్తే శరీరం, మైండ్ రెండూ కూడా సమస్థితికి వచ్చేస్తాయి". - పెరుమాళ్ల దత్తయ్య, యోగా గురువు

ఆరోగ్యమే మహాభాగ్యం: సూర్యోదయానికి మందే దత్తయ్య యోగా శిబిరానికి వచ్చి సాధన చేసే దత్తయ్య శిష్యులతో ప్రతిరోజూ కొత్తకొత్త యోగాసనాలు వేయిస్తారు. గతంలో ఎన్నో రోగాల బారిన తాము ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నామని ఆయన శిష్యులు చెబుతున్నారు. దీనికి కారణం యోగా నేని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ గంట సమయం యోగాకు కేటాయించాలని దత్తయ్య చెబుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని అది యోగాతోనే సమకూరుతుందని అంటున్నారు.

"అందం, ఆనందం, ఆరోగ్యం, ఆయుష్షు. ఈ నాలుగు కావాలంటే మనం ప్రతి రోజూ యోగా చేయాలి. నేను గత 25 సంవత్సరాల నుంచి పెరుమాళ్ల దత్తయ్య శిష్యురాలిని. నేను నేర్చుకున్న విద్యని గ్రామాలలో చెప్పేందుకు వెళ్తున్నాను". - పెరుమాళ్ల దత్తయ్య శిష్యురాలు

"నేను 18 సంవత్సరాలుగా యోగా నేర్చుకుంటున్నాను. యోగా చేయడం వలన నాకు చాలా లాభాలు కలిగాయి. నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. అలాగే అందరూ యోగా చేయాలి". - పెరుమాళ్ల దత్తయ్య శిష్యురాలు

యోగా ఎక్కడ పుట్టిందో తెలుసా? రోజూ ఆసనాలు వేస్తే బోలెడు హెల్త్ ​బెనిఫిట్స్​! - International Yoga Day 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.