ETV Bharat / state

గచ్చిబౌలిలో నిత్య పెళ్లికొడుకు - విగ్ పెట్టుకుని వేషాలు మారుస్తూ..! - MAN CHEATING IN THROUGH MATRIMONY

ఒక్క కుమార్తె ఉన్న కుటుంబాలే లక్ష్యం - గొంతెమ్మ కోర్కెలతో డబ్బులు స్వాహా

fraud_in_the_name_of_marriage_in_hyderabad
fraud_in_the_name_of_marriage_in_hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

Fraud in The Name of Marriage in Hyderabad : వారికి ఒక్కగానొక్క కూతురు. తను ఉన్నతవిద్య పూర్తి చేసింది. ఇక పెళ్లి చేద్దామనుకున్నారు. మ్యాట్రిమోనీ ద్వారా ఒక యువకుడి ప్రొఫైల్‌ నచ్చింది. అన్నీ కుదిరాయి బాజాభజంత్రీలు మోగిద్దామనుకున్నారు. పెళ్లిచూపుల తంతు పూర్తవగానే ఆ అబ్బాయి గొంతెమ్మ కోర్కెలు విని పెళ్లికూతురు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ కాబోయే అల్లుడే కదా తానా అంటే తందానా అన్నట్లు అన్నింటికీ అంగీకరించారు.

కొద్దిరోజులకే ఆభరణాలు, వివాహ ఖర్చులంటూ రూ.25 లక్షలు తీసుకున్నాడు. నమ్మించడం కోసం తాను కొంటున్న నగలను వాట్సాప్‌లోనూ పంపాడు. ఇంతలోనే పెళ్లి పనుల్లో నిమగ్నమైన వధువు ఇంటి వారికి ఊహించని షాక్‌ తగిలింది. అప్పటికే అతడికి పెళ్లైందని, కొన్ని సార్లు జైలుకు కూడా వెళ్లొచ్చినట్టు తెలిసింది. వెంటనే పెళ్లి రద్దు చేసి డబ్బు తిరిగివ్వమంటే ముఖం చాటేశాడు. అయినా ఊరుకోకుండా గట్టిగా నిలదీస్తే చెక్కులిచ్చాడు.

అవి చెల్లకపోవడంతో వధువు తరుపు వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. అప్పుడే అతడి గురించి మరిన్ని విషయాలు తెలిశాయి. నిందితుడు ఎంతోమంది యువతులను ఇలా మాయ చేస్తున్నాడని తెలిసి వారు విస్తుపోయారు. అతడు ఏం చదివాడో ఎవరికీ తెలియదు గానీ మాయమాటలతో బురిడీ కొట్టించడంలో పీహెచ్‌డీ చేశాడు. తాజాగా సైబరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇతడి ఆగడాలకు కళ్లెం వేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో నమోదైన కేసుల చిట్టా వెలికి తీస్తున్నారు.

పెళ్లి పేరుతో దగ్గరై డబ్బులు లాగేస్తారు - గట్టిగా అడిగితే ఎదురు కేసులు

ఇతనికి పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. మియాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌ వంటి ఖరీదైన ప్రాంతాల్లోనే ఉంటాడు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో సామాజికవర్గాలకు తగినట్టుగా పేరు మార్చుకుంటాడు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులతో పరిచయాలున్నట్టు నమ్మించేందుకు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పోస్టు చేస్తాడు.

ఒక్క కుమార్తె ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటాడు. వైద్యవిద్య పూర్తిచేసిన ఒక యువతిని పెళ్లి ఖర్చుల పేరిట రూ.20 లక్షలకుపైగా వసూలు చేసినట్టు సమాచారం. సికింద్రాబాద్‌కు చెందిన మరో కుటుంబానికి తాను ఐటీ కంపెనీ నిర్వాహకుడినంటూ భారీగా డబ్బు గుంజినట్టు తెలుస్తోంది. వయసు తెలియకుండా రకరకాల విగ్గులతో ఏమార్చుతాడు.

జస్ట్ 'ప్లేటు' మార్చింది - 50 లక్షలు సంపాదించింది - చివరకు ఏమైందంటే!

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.