Four Maoists Killed in Gadchiroli : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. 60 కమాండర్లతో జరిగిన కాల్పుల్లో మావోయిస్టులకు ఊహించని రీతిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. మరణించిన నలుగురూ తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్టులుగా అధికారులు గుర్తించారు. ఛత్తీస్గడ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఎదురుకాల్పులు జరిగినట్లు తెలిపారు.
ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషే- మావోయిస్టులతో సంబంధాల కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు
నలుగురిపై గతంలో పోలీసుశాఖ భారీ రివార్డు ప్రకటించినట్లు వెల్లడించారు. నలుగురు మావోయిస్టులపై గతంలో రూ.36 లక్షల రివార్డు ప్రకటన చేసినట్లు తెలిపారు. చనిపోయిన మావోయిస్టులను వర్గీస్, మగ్తూ, కుర్సంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్‌గా అధికారులు గుర్తించారు. ఎదురుకాల్పుల్లో మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ, ప్లటూన్ మెంబర్లు రాజు, వెంకటేశ్ మృతి చెందినట్లు చెప్పారు. ఘటనస్థలం నుంచి ఏకే 47, ఒక కార్బైన్, రెండు పిస్టల్స్‌తో సహా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Maoist Katakam Sudarshan : గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు నక్సల్స్ హతం.. మృతుల్లో టాప్ కమాండర్!