ETV Bharat / state

నాగర్‌ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత - సీఎం సహా ప్రముఖుల సంతాపం - FORMER MP MANDA JAGANNATHAM

హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ జగన్నాథం కన్నుమూత - నాలుగు పర్యాయాలు ఎంపీగా సేవలు - 3 సార్లు టీడీపీ, ఒకసారి కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా గెలుపు

NAGARKURNOOL
Former Nagarkurnool MP Manda Jagannatham (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2025, 9:39 PM IST

Updated : Jan 12, 2025, 10:51 PM IST

Nagarkurnool Former MP Manda Jagannatham passes away : నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబసభ్యులు గత నెలలో నిమ్స్‌లో చేర్చారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (జనవరి 12న) రాత్రి 7:30 గంటలకు కన్నుమూశారు. భౌతికకాయాన్ని చంపాపేట్‌లోని ఆయన నివాసానికి తరలించారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు దోభీఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన జగన్నాథం, వరుసగా నాలుగు సార్లు ఎంపీగా గెలిచి తన సేవలందించారు. 1996, 1999, 2004, 2009లో నాగర్‌కర్నూల్‌ ఎంపీ స్థానంపై పాగా వేసి ఘన విజయాలను తన సొంతం చేసుకున్నారు. 3 సార్లు టీడీపీ, ఒకసారి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలిచారు. దేశ రాజధాని దిల్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగానూ సేవలందించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఎస్పీ (బహుజన్‌ సమాజ్‌ పార్టీ)లో చేరారు.

ప్రముఖుల సంతాపం : నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ సభ్యుడిగా, సామాజిక తెలంగాణ ఉద్యమకారుడిగా జగన్నాథం పాత్ర మరువలేనిదని సీఎం రేవంత్‌ రెడ్డి కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని, జగన్నాథం మరణం తెలంగాణకు తీరని లోటని ఆయన సంతాపం తెలిపారు. జగన్నాథం మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జగన్నాథం కృషి, పార్టీకి వారు అందిన సేవలను బీఆర్‌ఎస్‌ అధినేత గుర్తుచేసుకున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్, మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు సహా పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు జగన్నాథం మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Last Updated : Jan 12, 2025, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.