ETV Bharat / state

అట్లుంటది మల్లారెడ్డితోని - మనవరాలి సంగీత్​లో అదరగొట్టే డ్యాన్స్ - MALLAREDDY DANCE TO DJ TILLU SONGS

మనవరాలి సంగీత్​ ఫంక్షన్​లో మల్లారెడ్డి మాస్ స్టెప్పులు - డీజే టిల్లు పాటలకు మాజీ మంత్రి అద్దిరిపోయే డ్యాన్స్ - నెట్టింట వైరల్​గా మారిన వీడియోస్

Mallareddy Dance Video
Mallareddy Dance in Granddaughter Sangeet (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 21, 2024, 2:22 PM IST

Updated : Oct 22, 2024, 5:13 PM IST

Mallareddy Dance in Granddaughter Sangeet : మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పేరు తెలియని వారు ఉండరేమో. తన డ్యాన్సులు, స్పీచ్​లతో ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే మన మల్లన్న మరోసారి వార్తల్లో నిలిచారు. డీజే టిల్లు పాటలకు హుషారైన స్పెప్పులేస్తూ నెట్టింట వైరల్​గా మారారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. తన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహం ఈ నెల 28న జరగనుంది. ప్రస్తుతం పెళ్లికి ముందు జరిగే పలు వేడుకలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం రాత్రి సంగీత్ ఫంక్షన్ జరిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు హాజరైన ఈ వేడుకలో మాజీ మంత్రి స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు.

75 ఏళ్ల వయసులోనూ అద్దిరిపోయే క్యాస్టూమ్స్​ ధరించి, స్టేజ్​పై మాస్ స్టెప్పులేశారు. కొరియోగ్రాఫర్లు, మనవళ్లను పక్కన బెట్టుకుని, వారికి ఏమాత్రం తగ్గకుండా డ్యాన్స్ ఇరగదీశారు. డీజే టిల్లు పాటలకు మన మల్లన్న వేసిన మూమెంట్స్ చూసి అక్కడున్న వారంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఇది చూసిన నెటిజన్లంతా 'టిల్లన్న కంటే మా మల్లన్న డ్యాన్స్ ఏమాత్రం తక్కువ లేదు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మన మల్లన్న టిల్లు డ్యాన్స్ మీరూ చూసేయండి మరి. (ఈ డ్యాన్స్ కోసం మల్లారెడ్డి కొరియోగ్రాఫర్ల వద్ద శిక్షణ కూడా తీసుకోవడం గమనార్హం.)

స్టెప్పెస్టే - వీడియో వైరల్ అవ్వాల్సిందే : మాజీ మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్ చేయడం ఇది మొదటిసారి కాదు. ఏదైనా శుభకార్యానికో, లేదా ఏ సినిమా ఫంక్షన్​కో వెళ్లాడంటే మల్లన్న డ్యాన్స్ చేయాల్సిందే. ఆ వేడుకలకు హాజరైన వారు అడిగి మరీ మల్లన్నతో స్టెప్పులేయిస్తారు. ఆయన డ్యాన్స్​ వీడియోలకు ఫ్యాన్స్ బేస్ అలా ఉంటది మరి. ఆ వీడియోలు చూసి హ్యాపీగా నవ్వుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అందుకే మల్లారెడ్డి డ్యాన్స్ వీడియోలు నెట్టింట ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటాయి.

Last Updated : Oct 22, 2024, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.