ETV Bharat / state

'రిజర్వ్ బ్యాంక్​ గణాంకాలే - కేసీఆర్​ హయంలో రాష్ట్ర అద్భుత వృద్ధికి నిదర్శనం' - KTR on Telangana Development

KTR on RBI Reports : రాజకీయ నేత అయితే ఎన్నికల గురించి, రాజనీతిజ్ఞుడు అయితే రాష్ట్ర భవిష్యత్​ గురించి ఆలోస్తారని బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ​పేర్కొన్నారు. ఇవాళ రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన గణాంకాలపై స్పందించిన ఆయన, కేసీఆర్​ హయంలో సాధించిన అభివృద్ధే రాష్ట్ర అద్భుత వృద్ధికి ​నిదర్శమని ఎక్స్​ వేదికగా స్పష్టం చేశారు.

KTR on Telangana Growth by RBI Report
KTR on RBI Reports (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 9, 2024, 9:17 PM IST

KTR on Telangana Growth by RBI Report : ఒక రాజకీయ నాయకుడు తదుపరి ఎన్నికల గురించి ఆలోచిస్తారని, అదే ఒక రాజనీతిజ్ఞుడు భవిష్యత్ తరం గురించి ఆలోచిస్తారని, ఆ దిశలోనే కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రగతి సాధించిందని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. గడచిన దశాబ్ద కాలంలో కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ తరహా ఫలితాలు చూపగలరా అని ప్రశ్నించారు. దేశంలోనే చిన్న వయసు కలిగిన రాష్ట్రమైన తెలంగాణ పలు కీలక అంశాల్లో ఇతర రాష్ట్రాలను అధిగమించిందని రిజర్వ్ బ్యాంక్ గణాంకాలే ఇందుకు నిదర్శమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కొన్ని గణాంకాలను ప్రస్తావించారు.

KTR on Congress BJP Government Developments : 2022-23లో రాష్ట్ర తలసరి ఆదాయం 3.08 లక్షల రూపాయలకు చేరిందని, ఇది పెద్ద రాష్ట్రాలన్నింటిలోనూ ఎక్కువ అని కేటీఆర్​ తెలిపారు. 2014-15 నుంచి 2021-22 వరకు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 11.6 శాతం వృద్ధిని సాధించిందని, జాతీయ సగటు కేవలం 3.228 శాతం మాత్రమేనని పేర్కొన్నారు. సాగునీటి రంగంలోనూ 2014-15 నుంచి 2020-21 మధ్య తెలంగాణ వృద్ధి 11.6 శాతంగా ఉంటే జాతీయ సగటు 2.108 అని తెలిపారు. 2014-15 నుంచి 2021-22 మధ్య ఏడేళ్ల కాలంలో వార్షిక వృద్ధి రేటు కూడా గణనీయంగా 15.9 శాతం నమోదైందని, జాతీయ సగటు 10.09 శాతంగా ఉన్నట్లు చెప్పారు.

కేసీఆర్​ హయంలో రాష్ట్రాభివృద్ధికి గణాంకాలే నిదర్శనం : 2022-23 సంవత్సరంలో తలసరి సొంత పన్ను రాబడిలోనూ 30,914 రూపాయలతో ఇతర పెద్ద రాష్ట్రాలను అధిగమించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో 40 శాతం మహిళల చేతిలోనే ఉన్నాయన్న ఆయన, జాతీయ సగటు అయిన 20 శాతం కంటే ఇది రెట్టింపు అని వివరించారు. రాష్ట్రంలో సగటున 4,460 మందికి ఒక ఎంబీబీఎస్ సీటు ఉంటే జాతీయ సగటు 12,851గా ఉందని తెలిపారు. 2021-22లో తలసరి ఎస్జీఎస్టీ సగటు 7,665 రూపాయలు కాగా జాతీయ సగటు 4,461 రూపాయలు మాత్రమేనని తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర అద్భుత వృద్ధికి రిజర్వ్ బ్యాంకు గణాంకాలే నిదర్శమని కేటీఆర్ పేర్కొన్నారు.

ధ్వంసమైన అడవులను కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు కేసీఆర్ : కేటీఆర్ - KTR about Forest in Telangana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.