ETV Bharat / state

రేవ్ పార్టీకి సంబంధించి మరో వీడియో విడుదల చేసిన హేమ - ఈసారి ఏమందంటే? - Hema another video on rave party - HEMA ANOTHER VIDEO ON RAVE PARTY

Bangalore Rave Party Latest Update : బెంగళూరు రేవ్‌ పార్టీ కేసుకు సంబంధించి సినీ నటి హేమ మరో వీడియో విడుదల చేశారు. డ్రగ్స్‌కు సంబంధించి తాను అన్ని పరీక్షలు చేయించుకున్నానని, అన్ని రిపోర్టుల్లోనూ నెగిటివ్‌ వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకనైనా తనపై అనవసర ఆరోపణలు ఆపాలని మీడియా ఛానళ్లకు విజ్ఞప్తి చేశారు.

Film actress Hema
Bangalore rave party (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 20, 2024, 5:18 PM IST

Updated : Aug 20, 2024, 5:23 PM IST

Actor Hema Clarity on Rave Party : కర్ణాటకలోని బెంగళూరు శివారు ప్రాంతంలో మే నెలలో జరిగిన ఓ రేవ్ పార్టీలో సినీ నటి హేమ పాల్గొని, పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి ఏపీ, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు హాజరు కాగా, వారిలో సినీ రంగానికి చెందిన కొందరు నటులు, బుల్లితెర నటులు, మోడల్స్ ఉన్నట్లుగా అప్పట్లో పోలీసులు వెల్లడించారు. పార్టీలో పాల్గొన్న వారితో పాటు 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం పట్టుబడిన వారి రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలకు పంపగా, మొత్తం 103 మందిలో 86 మందికి డ్రగ్‌ పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు కర్ణాటక పోలీసులు నిర్ధారించారు. పలువురు నటుల రక్త నమూనాల్లోనూ మాదక ద్రవ్యాల ఆనవాళ్లను గుర్తించిన పోలీసులు, వారిలో తెలుగు నటి సైతం ఉన్నట్లు స్పష్టం చేశారు. పాజిటివ్​ వచ్చిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అయితే పాజిటివ్‌ వచ్చిన తెలుగు నటి పేరు మాత్రం వెల్లడించలేదు. అయినప్పటికీ ఆ నటి హేమ అయి ఉంటారంటూ అప్పట్లో అనేక పుకార్లు షికార్లు కొట్టాయి.

మా అసోసియేషన్ కీలక నిర్ణయం - సినీ నటి హేమ సస్పెండ్​! - Maa Association Suspend Hema

వీటన్నింటికీ ఫుల్‌ స్టాప్‌ పెడుతూ నటి హేమ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. రేవ్‌ పార్టీకి సంబంధించి తాను అన్ని పరీక్షలూ చేయించుకున్నానని, ఇటీవల వచ్చిన రిపోర్టుల్లో అన్నింట్లోనూ తనకు నెగిటివ్‌ వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అన్ని టీవీ ఛానళ్లకు వెల్లడించానని, అవసరమైతే బహిరంగ టెస్టులకూ తాను సిద్ధమేనంటూ తెలిపారు. ఇకనైనా తనపై అనవసర ఆరోపణలు మానుకోవాలని కోరారు. ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లను కలవాలనుకుంటున్నానన్న ఆమె, అపాయింట్‌మెంట్‌ ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేశారు.

గత కొన్ని నెలలుగా మీడియాలో నాపై అనేక పుకార్లు పుట్టాయి. 35 సంవత్సరాలుగా నేను సంపాదించున్న పరువును మీడియా వాళ్లు భూస్థాపితం చేశారు. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి నేను కొన్ని టెస్టులు చేయించుకున్నారు. నా వెంట్రుకలు, గోళ్లు, రక్తం అన్ని పరీక్షల కోసం ఇవ్వగా, నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. ఈ విషయాన్ని నేను ఇప్పటికే మీడియా ఛానళ్లకు చెప్పాను. అవసరమైతే బహిరంగ టెస్టులకూ సిద్ధమే. నాకు సీఎం రేవంత్‌ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అపాయింట్‌మెంట్‌ కావాలి. అందుకోసమే నేను ఈ వీడియో చేశా. - సినీ నటి హేమ

రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారు : బెంగళూరు పోలీస్ కమిషనర్ - Bangalore Rave Party Details

నేను అక్కడ లేను - రిసార్ట్‌లో చిల్‌ అవుతున్నా : బెంగళూరు రేవ్​ పార్టీ విషయం వెలుగులోకి రాగానే, అందులో తెలుగు నటి హేమ పాల్గొన్నారంటూ పలు వార్తా ఛానళ్లు ప్రసారం చేశాయి. వాటిపై స్పందించిన హేమ ఆ వార్తలను ఖండించారు. తాను ఆ పార్టీకి వెళ్లలేదని, హైదరాబాద్​లోనే ఓ రిసార్ట్​లో చిల్​ అవుతున్నానంటూ ఓ వీడియో రిలీజ్​ చేశారు. తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దంటూ మండిపడ్డారు. అయితే ఈ విషయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్, రేవ్​ పార్టీలో నటి హేమ పాల్గొన్నారని స్పష్టం చేశారు.

బెంగళూరు రేవ్​ పార్టీపై స్పందించిన నటీనటులు శ్రీకాంత్​, హేమ - Actor Hema Reacts on Rave Party

Last Updated : Aug 20, 2024, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.