ETV Bharat / state

వైరల్​ వీడియో - బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన శునకం, అతికష్టం మీద రక్షించిన ఫైట్ మాస్టర్స్ రామ్​ లక్ష్మణ్

బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన శునకం - నటుడు ప్రభాస్ సినిమా రాజాసాబ్ షూటింగ్ వద్ద ఘటన - రక్షించి పిల్లల దగ్గరకు చేర్చిన రామ్, లక్ష్మణ్

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 46 minutes ago

RAM LAXMAN MASTERS
FIGHT MASTERS SAVED THE DOG (ETV Bharat)

Fight Masters Ram Laxman Saves Dog : హైదరాబాద్​లోని అజీజ్ నగర్​లోని హీరో ప్రభాస్​ నూతన చిత్రం రాజాసాబ్ షూటింగ్ జరుగుతున్న క్రమంలో ఓ విచిత్రం జరిగింది. ఫైట్ మాస్టర్స్ రామ్,​ లక్ష్మణ్ స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆ పరిసరాల్లో శబ్దాలు వినిపించాయి. కుక్క మూలిగిన శబ్దంలా అనిపించి గమనించిన మేనేజర్ వెళ్లి చూడగా అక్కడ చిన్న కొండలో చిక్కుకుపోయిన ఓ కుక్క ఉంది. ఈ నేపథ్యంలో ఫైట్ మాస్టర్స్​తో పాటు అందరూ వెంటనే కుక్కను కాపాడేందుకు క్రేన్ సహాయంతో బయటకు తీయడానికి ప్రయత్నించారు.

వైరల్​ వీడియో - బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన శునకం, రక్షించిన రామ్​ లక్ష్మణ్ (ETV Bharat)

కానీ ప్రయత్నించే క్రమంలో క్రేన్ తాడు కూడా తెగిపోయింది. కొండ రాయిని పక్కకు లాగుదామని ప్రయత్నించగా ఆ పని కూడా అవ్వలేదు. తర్వాత చిన్నగా రాయిని పక్కకు తొలగించి కుక్క కాలుకి ఒక తాడుని కట్టి చిన్నగా బయటకు తీశారు. దీంతో ఆ కుక్కను దాని పిల్లల దగ్గరకు చేర్చారు రామ్​ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ అండ్ టీం. ఆ శునకానికి శరీరంపై అక్కడక్కడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆ రోజే మూవీ టీం సర్​ప్రైజ్​? : కాగా రాజాసాబ్ సినిమాకు డైరెక్టర్ మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం రూ. 400 కోట్ల భారీ బడ్జెట్​తో పాన్​ ఇండియా లెవల్​లో రూపొందుతుంది. రాజాసాబ్​ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. తమన్​ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 10 2025న విడుదల కానుంది. అక్టోబర్ 23 న ప్రభాస్ బర్త్​డే సందర్భంగా రాజాసాబ్ నుంచి సర్​ప్రైజ్​ ఇచ్చే పనిలో మూవీ టీం వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల గ్లింప్స్ కూడా విడుదలైంది. దాంట్లో ప్రభాస్ చాలా స్టైలిష్​గా పూలతో కనువిందు చేశారు. రాజాసాబ్ సినిమా హర్రర్, రొమాంటిక్, కామెడీ కాంబినేషన్​లో వస్తోంది.

డైరెక్టర్ మారుతీ ప్రేక్షకులను ఎంగేజ్​ చేయగల సామర్థ్యం ఉన్న గొప్ప దర్శకుడు. గతంలో ఆయన మారుతీ డైరెక్షన్ చేసిన ఈ రోజుల్లో, బస్​ స్టాప్ యువతను ఎంతగానో కట్టి పడేసాయి. ప్రేమ కథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్ సినిమాలతో ప్రేక్షకులకు మంచి వినోదంతో అలరించాడు.

ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ - ఆ రోజు నుంచి వరుసగా 'రాజాసాబ్'​ అప్డేట్స్​

ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడేది అప్పుడే: మారుతి

Last Updated : 46 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.