ETV Bharat / state

అమ్మో - ఎంత పే.....ద్ద కొండ చిలువో - చూస్తే గుండెల్లో గుబులు పుట్టాల్సిందే! - PYTHON UPDATE IN NIZAMABAD

నిజామాబాద్​ జిల్లాలో భారీ కొండ చిలువ - ఒక్కసారిగా భయాందోళనలకు గురైన ప్రజలు - చాకచక్యంగా పామును పట్టుకున్న స్నేక్​ క్యాచర్​

PYTHON NEWS IN NIZAMABAD
A BIG PYTHON IN SNAKE CATCHER HANDS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2024, 4:16 PM IST

Python in Nizamabad District : మనం గ్రామాలలో చెట్లు దట్టంగా ఉన్న ప్రదేశాలల్లో పాములు ఉండడం సహజం. అడవి, దట్టమైన చెట్లు ఉన్న చోటే వాటి నివాసం. కానీ అవి మనం ఉన్న చోటే ఉంటే ఎలా ఉంటుంది. ఊహించుకుంటానే శరీరంలో గుబులు పుడుతోంది కదా. మనం తిరిగే ప్రదేశాల్లో కాకుండా ఏకంగా ఇంట్లో, వాష్​​రూంలో, వాషింగ్​ మెషిన్​లో, బైక్​లోనూ ఉంటే ఎవరికైనా వామ్మో అని భయంగా ఉంటుంది. అవును మీరు భయపడినా ఇంట్లోనూ, బాత్​రూంలో ఆఖరికి బైక్​లో కొండచిలువ ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరిగిన చోట అక్కడున్న వ్యక్తులు భయాందోళనకు గురికావడం పక్కా. ఇలాంటి ఘటనే కొందరు స్థానికులను నిజామాబాద్​ జిల్లాలో భయపెట్టింది.

ఏకంగా పదిహేను అడుగులు : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మైలారం శివారులో స్థానికులకు ఓ భారీ కొండచిలువ కనిపించింది. దాని పొడవు సుమారుగా పదిహేను అడుగులు ఉంది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు నిజామాబాద్​ పట్టణానికి చెందిన స్నేక్ క్యాచర్(పాములు పట్టే వ్యక్తి) మల్లేశ్​కు సమాచారమిచ్చారు. ఆయన వెంటనే కొండ చిలువ ఉన్న ప్రాంతానికి చేరుకుని సుమారు గంటపాటు శ్రమించి దాన్ని పట్టుకున్నారు. పదిహేను అడుగుల పొడవు ఉన్న ఈ పామును సురక్షితంగా దగ్గరలోని దట్టమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టారు.

కొన్ని సందర్భాల్లో కొండ చిలువ : గతంలో ఏపీలో ప్రకాశం జిల్లా మార్కాపురంలోని కోర్టు సముదాయంలో కొండ చిలువ పిల్లలు కలకలం రేపాయి. కోర్టు ప్రాంగణంలో ఒకే చోట ఆరు కొండ చిలువ పిల్లలు ఉండటాన్ని అక్కడున్న సిబ్బంది గమనించి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే కోర్టు సిబ్బంది అటవీ శాఖకు చెందిన స్నేక్ క్యాచర్​కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ స్నేక్ క్యాచర్ చెట్ల పొదల్లో ఉన్న ఆరు పాము పిల్లలను పట్టుకుని తల్లి కొండ చిలువ కోసం కోర్టు ప్రాంగణంలో వెతికారు. ఎక్కడ కనిపించకపోవడంతో వాటిని సురక్షిత ప్రాంతాల్లో వదిలారు.

కోళ్లను తినడానికి వచ్చిన కొండచిలువ - ఇంతలో ఏం జరిగిందంటే? - BIG PYTHON SPOTTED IN WARANGAL

కుమురంభీం ఆసిఫాబాద్ అడవుల్లో చెట్టు ఎక్కుతూ 15 అడుగుల కొండచిలువ - సోషల్ మీడియాలో వీడియో వైరల్ - Python Virial Video In Adilabad

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.