FedEx Crimes in Hyderabad : హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన సీనియర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి గత నెలలో ఫెడ్‌ఎక్స్ పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ఆధార్ వివరాల ద్వారా పార్శిల్ వచ్చిందని నమ్మించారు. ఆ పార్శిల్‌లో థాయిలాండ్ నుంచి డ్రగ్స్ వచ్చాయని తెలిపారు. పోలీసులు మీపై కేసు నమోదు చేశారని నమ్మించారు. భయాందోళనకు గురైన బాధిత మహిళ ఫోన్‌లో పరిష్కారం చూపాలని కోరింది. సమాధానంగా ఫోన్‌లో తమకు సంబంధించిన వెబ్‌సైట్‌లు తెరవాలని చెప్పారు. వెంటనే ఖాతాలన్ని తెరిచిన ఆమె వివరాలు అన్నీ తీసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని ఆమెకు సూచించారు. 15లక్షల 78 వేల రూపాయలు ఆమె ఖాతా నుంచి కాజేశారు. మోసపోయానని తెలుసుకొని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయోధ్య రాముడి పేరుతో సైబర్ క్రైమ్స్ - ఆ లింకులు క్లిక్ చేశారో ఖాతా ఖాళీయే
FedEx Parcel Frauds Hyderabad : మరో కేసులో నగరానికి చెందిన బాధితురాలి నుంచి ఈ తరహాలోనే 80లక్షల రూపాయలు దోచేశారు. మరో వ్యవహారంలో అమాకురాలి నుంచి 14 లక్షల 50వేలు కాజేశారు. ఇప్పటి వరకు ఇలాంటి కేసులపై గతేడాదిలో హైదరాబార్ కమిషనరేట్ పరిధిలో 50కి పైగా కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో 6కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధుల్లోనూ అనేక కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితుల నుంచి ఫిర్యాదులు పెరగడంతో సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మెట్రో నగరాల్లో నిందితుల కోసం గాలించి కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మీకొచ్చిన కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయని డబ్బులు డిమాండ్ చేస్తున్నారా? - బీకేర్‌ఫుల్
అందులో భాగంగా కొరియర్ స్కామ్ కేసులో కేరళకి చెందిన 21ఏళ్ళ బికామ్ విద్యార్ధిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేరంలో నిందితులకు 58 ఖాతాలను సమకూర్చినట్లు పోలీసులు గుర్తించారు. తన స్నేహితులు, బంధువుల డాక్యుమెంట్లతో ఖాతాలు తెరచి కమిషన్ తీసుకొని అందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అలా కాజేసిన సొమ్ము బిట్ కాయిన్ల రూపంలో చైనాకు తరలివెళ్తుందని పోలీసులు పేర్కొన్నారు.
ఇవే కాక దేవ్యాప్తంగా అనేక కేసులు వెలుగులోకి వస్తున్న కానీ సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలు వెతుకొని మరి నేరాలకు పాల్పడుతున్నారు.ఇటువంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. ఈ తరహా ఫోన్‌కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఒక వేళ డబ్బు కోల్పోతే 1930 నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.
సైబర్ క్రైమ్స్‌లో మొదటి స్థానంలో తెలంగాణ - ఆర్థిక నేరాలు, ఫేక్ న్యూస్ వ్యాప్తిలోనూ మనమే
Cyber Crime Cases in Hyderabad : లైక్ కొడితే రూ.200 అని ఆశచూపి.. రూ.59 లక్షలు దోచేశారు